calender_icon.png 6 December, 2024 | 5:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చెక్కుల పంపిణీలో రగడ

02-11-2024 03:21:29 AM

చెక్కుల పంపిణీలో రగడ

బ్యానర్ లేకపోవడంతో కాంగ్రెస్ నేతల వాగివాదం

ఆదిలాబాద్, నవంబర్ 1 (విజయ క్రాంతి) : ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలో జరిగిన దండారి ఉత్సవాల చెక్కుల పంపిణీలో రగడ నెలకొంది. బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్‌తో అధికారులు గురువారం చెక్కులు పంపిణీ చెయించారు. ప్రభుత కార్యక్రమం సందర్భంగా అధికారులు కార్యక్రమానికి సంబంధించి ఎలాంటి బ్యానర్లు పెట్టకుండానే చెక్కులు పంపిణీ చేయించడంపై కాంగ్రెస్ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. బ్యానర్లు లేకుండా ప్రభుత కార్యక్రమాన్ని ఎలా చేపట్టారని కాంగ్రెస్ నేతలు ఫయాజ్ ఉల్లా ఖాన్, రూపేష్ రెడ్డిలు అధికారులతో వాగివాదానికి దిగారు. సీఎం రేవంత్ రెడ్డి, జిల్లా ఇంచార్జీ మంత్రి సీతక్క చిత్రపటాలు లేకుండా అధికారిక కార్యక్రమాలు నిరహించడం ఏంటని ప్రశ్నించారు. ఈ విషయమై ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి సైతం అధికారుల తీరును తప్పుబట్టారు. దీంతో కాసేపు అక్కడ గందరగోళం నెలకొంది.