12 July, 2026 | 2:15 PM

Breaking News

రూ.339.59 కోట్లతో భువనగిరి–చిట్యాల నాలుగు లేన్ల రహదారికి శంకుస్థాపన.   •   ఈ నెల 14న కళాశాల బంద్ విజయవంతం చేయాలి   •   ప్రజలకు నాణ్యమైన రహదారి, మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం   •   స్నాప్‌చాట్, ఇన్‌స్టాగ్రామ్ యాప్‌లను కేంద్ర ప్రభుత్వం వెంటనే నిషేదించాలి   •   ఏజెన్సీ ప్రాంతాల సమస్యలపై ముఖ్యమంత్రికి నివేదన   •   42వ డివిజన్‌ లో ఓపెన్ జిమ్ ఏర్పాటు   •   "సర్" ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలి   •   మద్రాస్ తండాలో కాంగ్రెస్ గ్రామ కమిటీ ఎన్నిక   •   గాయని జానకి మృతికి విజయ్, నటులు, సంగీతకారులు సంతాపం   •   గాయని ఎస్.జానకి మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం   •  

ఎమ్మెల్సీగా గెలిపిస్తే సేవకుడిగా పని చేస్తా

02-11-2024 03:16 AM

అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వీ నరేందర్ రెడ్డి

కరీంనగర్, నవంబర్ 1 (విజయక్రాంతి): రానున్న పట్టభద్రుల ఎన్నికల్లో తనను ఎమ్మెల్సీగా ఆశీర్వదించి గెలిపిస్తే సేవకుడిగా పని చేస్తానని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వీ నరేందర్‌రెడ్డి అన్నారు. కరీంనగర్‌ంలోని పలు పాఠశాలల్లో శుక్రవారం ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి నాలుగు జిల్లాల వ్యాప్తంగా నిరుద్యోగులకు స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాలు ఏర్పాటు చేస్తానన్నారు. పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్ బకాయిలను విడుదల చేయించేందుకు కృషి చేస్తానన్నారు.

ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ డీఏపై ప్రభుత్వంతో మాట్లాడి విడుదల చేయిస్తానని వెల్లడించారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యుర్థుల కోసం ప్రత్యేక యాప్‌ను రూపొందిస్తానన్నారు. ఈ నెల 6వ తేదీలోపు ప్రతి పట్టభద్రుడు విధిగా ఓటు హక్కును నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు.