11-01-2026 01:33:08 AM
మేడారం జాతరకు మెరుగైన రవాణా సౌకర్యం
బండెనుక బండికట్టి..
హెలికాప్టర్ ఎక్కి..
ఆసియా ఖండంలో అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు మొదట్లో కాలినడకన, ఎడ్లబండ్లపై భక్తులు తరలి వచ్చేవారు. తెలంగాణ నలుమూలలతోపాటు చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల నుంచి కూడా అత్యధిక సంఖ్యలో గిరిజనులు, గిరిజనేతరులు జాతరకు వ స్తుంటారు. రవాణా సౌకర్యం సరిగా లేని రోజుల్లో చంటిపిల్లలు, మహిళలు, వృద్ధుల కోసం ప్రత్యేకంగా ఎడ్లబండ్లను సమకూర్చుకొని జాతరకు వారం పది రోజుల ముందుగానే ఇంటి నుంచి బయలుదేరి, జాతర ముగిసిన తర్వాత పది రోజులకు తిరిగి ఇంటికి చేరేవారు.
కొంతకాలానికి ప్రభుత్వం జాత రను నిర్వహించడానికి పూనుకోవడంతో రవాణా సౌకర్యంపై దృష్టిసారించారు. ఈ క్రమంలో దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న మేడారంకు రోడ్డును వేయడం తోపాటు జంపన్న వాగుపై వంతెన నిర్మించారు. తర్వాత మేడారం జాతరకు ఉమ్మ డి ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి ఆర్టీసీ బస్సులు ప్రత్యేకంగా నడిపిస్తున్నారు. దీనితో మేడారం జాతరకు ఎడ్ల బండ్ల రాక క్ర మంగా తగ్గుతూ వస్తోంది.
ములుగు జిల్లా మేడారం సమీప గ్రామా ల నుంచి ప్రస్తుతం ఎడ్లబండ్లలో భక్తులు జాతరకు వస్తున్నారు. 2022లో మేడా రం జాతరకు హెలికాప్టర్ సేవలు ప్రారంభించారు. హైదరాబాద్‌తోపాటు హనుమ కొండ నుంచి మేడారంకు ప్రత్యేకంగా జాతర సమయంలో హెలికాప్టర్ సేవలను అందుబాటులోకి తెచ్చారు. దీనితో మేడారం జాతరకు అటు ప్రైవేట్ వాహనాలు, ఆర్టీసీ బస్సులు, చివరకు హెలి కాప్టర్ ద్వారా వస్తున్నారు. దీంతో మే డారం జాతర విశ్వవ్యాప్తంగా గుర్తింపు పొందింది.
బండి సంపత్ కుమార్,
మహబూబాబాద్, విజయక్రాంతి