calender_icon.png 11 January, 2026 | 1:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గిరిజనుల కొంగుబంగారం

11-01-2026 01:31:48 AM

వనదేవతలు కొలువై ఉన్న పుణ్యస్థలం.. కుంకుమ భరణికి కోటి మొక్కల నడుమ, కంక చెట్లకు వేల దండాలు వేలాడే పవిత్ర ప్రాంగణం మేడారం. దారి ఏదైనా.. అన్ని దారులు చివరికి అమ్మ దగ్గరికే తీసుకెళ్లే భక్తి భావం. పేద, ధనిక అన్ని వర్గాల వారందరికీ.. ఏ రాయిని కొలిచినా అమ్మ పలు కే... నిలువెత్తు బెల్లమే బంగారంగా కోట్లాదిమందికి కొంగుబంగారమై ప్రపంచం లోనే అతిపెద్ద ఆదివాసీ గిరిజన జాతరగా గుర్తింపు పొందిన మేడారం సమ్మక్కసారలమ్మ జాతర నిర్వహణకు తెలంగా ణ ప్రభుత్వం సర్వసన్నద్ధమైంది. రెండు సంవత్సరాలకు ఒకసారి ఘనంగా జరిగే ఈ మహాజాతర కోసం ఈసారి ప్రభు త్వం వందల కోట్లతో అభివృద్ధి నిధులు వెచ్చించి, భక్తులకు ఎలాంటి అసౌకర్యమూ కలగకుండా సమగ్ర ఏర్పాట్లు చేపట్టింది.

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేపట్టిన మాస్టర్ ప్లాన్‌లో శాశ్వత నిర్మాణాలు చేపట్టడంతోపాటు ఆదివాసీల సాంస్కృతిక పునర్జీవనానికి వేదికగా తీర్చిదిద్దుతోంది. మేడారం జాతర కేవలం ఆధ్యాత్మిక ఉత్సవం కాదు. అది తెలంగాణ గిరిజనుల ఆత్మగౌరవానికి ప్రతీక. అడవుల మధ్య పుట్టిన ఒక తిరుగుబాటు గాధ, త్యాగంతో ముడిపడ్డ చరిత్ర, తరతరాలకు సంక్రమించిన విశ్వాసం. అలాంటి జాతరను నిర్వహించడం ప్రభుత్వానికి పరిపాలనా కర్తవ్యమే కాదు -సాంస్కృతిక ధర్మం కూడా. ఈ నేపథ్యంతోనే తెలంగాణ ప్రభుత్వం ఈసారి మేడారం జాతరను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ మహాజాతరకు ఈసారి తాత్కాలిక ఏర్పాట్లకు పరిమితం కాకుండా, శాశ్వ త అభివృద్ధి దిశగా అడుగులు వేసిం ది. 

రూ.230 కోట్ల నిధులతో అభివృద్ధి

రూ.230కోట్ల నిధులతో చేపట్టిన మే డారం అభివృద్ధి పనులు కేవలం జాతరరోజులకే కాదు.. రాబోయే దశాబ్దాలకు ఉపయోగపడే మౌలిక సదుపాయాలుగా నిలవనున్నాయి. మేడారం, తాడ్వా యి, ములుగు మార్గాల్లో బీటీ, సీసీ రోడ్ల విస్తరణ, శాశ్వత విద్యుత్ సరఫరా వ్యవస్థలు, తాగునీటి పైపులైన్లు, ఓవర్‌హెడ్ ట్యాంకు లు, భక్తుల విశ్రాంతి కోసం పక్కా షెడ్లు ఇవన్నీ గిరిజనప్రాంతాల అభివృద్ధికి కీల క ఆస్తులుగా మారనున్నాయి. మేడారం అభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేకదృష్టి సారించారు. గతంలో ఎన్న డూ లేనంత స్థాయిలో శాశ్వత నిర్మాణా లు చేపట్టారు. దాదాపు 200 ఏళ్ల పాటు నిలిచేలా గ్రానైట్ కట్టడాలు, గద్దెల పునరుద్ధరణ, ప్రాకారాలు, రాతి ద్వారాలు నిర్మించారు. ఈ నెల 28 నుంచి 31 వరకు జరగనున్న మేడారం జాతరకు భక్తులు తరలి రానున్నారు.

పారిశుధ్యం, రవాణాపై ప్రత్యేక దృష్టి

పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. వేల సంఖ్యలో తాత్కాలిక మరుగుదొడ్లు, చెత్త సేకరణ తరలింపునకు ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేశారు. 24 గంటల పాటూ పరిశుభ్రత సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు. జాతర ముగిసిన వెంటనే ప్రాంతాన్ని పూర్తిగా శుభ్రం చేసే పోస్ట్-జాతర యాక్షన్ ప్లాన్ కూడా సిద్ధంగా ఉంది. రవాణా వ్యవస్థను సైతం విసృ్తతంగా ప్రణాళికబద్ధం చేశారు. తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులను ప్రవేశపెట్టింది. రాష్ర్టంతోపాటు పొరుగు రాష్ట్రా ల నుంచి వచ్చే భక్తుల కోసం ప్రత్యేక రూ ట్లు, అదనపు డిపోలను ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ నియంత్రణకు వేర్వేరు రాక పోక మార్గాలు, ప్రత్యేకపార్కింగ్ జోన్లను, పోలీ స్ ట్రాఫిక్ ప్లాన్‌ను అమలు చేస్తున్నారు.

భారీస్థాయిలో భద్రతా చర్యలు

భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నట్టుగా ప్రభుత్వం చర్యలు చేపట్టిం ది. వేలాది పోలీస్ సిబ్బంది, మహిళా భక్తుల కోసం ప్రత్యేకబృందాలు, సీసీటీవీ కెమెరాలు, డ్రోన్ పర్యవేక్షణ ఏర్పాటు చేశారు. వైద్య సేవల పరంగా తాత్కాలిక ఆస్పత్రులు, మొబైల్ మెడికల్ యూని ట్లు, అంబులెన్సులు, 24 గంటల పాటు అందుబాటులో ఉంచారు. మేడారం జాతర తెలంగాణకు గర్వకారణం. భక్తి, సంస్కృతి, అభివృద్ధి ఈ మూడు ఒకే వేదికపై కలిసే అరుదైన సందర్భం ఇది. ప్రభుత్వం వెచ్చించిన నిధులు, చేపట్టిన శాశ్వత పనులు, అమలు చేస్తున్న పరిపాలనా చర్యలు ‘న భూతో న భవిష్యత్’ అన్నట్లు ఉన్నాయి. ప్రయాగ్ రాజ్ కుంభమేళా మాదిరిగా కేంద్ర ప్రభుత్వం తెలం గాణ కుంభమేళా మేడారానికి సహకరిం చాలని యావత్ ప్రజానీకం కోరుతోంది.

 అమరవాజీ నాగరాజు, 

టీపీసీసీ చీఫ్ పీఆర్వో