29 May, 2026 | 2:54 AM

ఇకపై తక్కువ ధరకు స్వచ్ఛమైన మంచినీరు

29-05-2026 12:00 AM

వారసంతలో రేకుల షెడ్లు నిర్మాణం

భీమదేవరపల్లి, మే 28 (విజయక్రాంతి): ఇకపై గ్రామీణ ప్రాంతాల్లోని కుటుంబాలకు స్వచ్ఛమైన మంచినీటిని రామ్కి సంస్థ ద్వారా ఎలాంటి లాభాపేక్ష లేకుండా సరఫరా చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. హను మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ గ్రామానికి చెందిన సీఎంఓ ఎస్డీ వేముల శ్రీనివాస్ ఆధ్వర్యంలో గత పది సంవత్సరాల క్రితం తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మోడల్ లైబ్రరీని ఏర్పాటు చేశారు.

ఈ నేపథ్యంలోనే ముల్కనూర్ ప్రజలకు అతి తక్కువ ధరలో స్వచ్ఛమై న మంచినీటిని అందించేందుకు ఓఎస్‌డీ వేముల శ్రీనివాస్ రామ్కి సంస్థ ఆధ్వర్యంలో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ప్రజలకు స్వచ్ఛమైన మంచినీటిని తక్కువ ధ రకు అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అలాగే గ్రామంలో ప్రతి శనివారం వారసంత నిర్వహిస్తారు. వారసంతలో కనీ సం రేకుల షెడ్లు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు.త్వరితగతన రేకుల షెడ్లు ఏర్పాటు చేయాలని ఓఎస్‌డీ వే ముల శ్రీనివాస్ రామ్‌కి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు.గురువారం వార సంతతో పాటు వాటర్ ప్లాంట్ పనులను ఓఎస్డీ పర్యవేక్షించారు.