ఉపాధి కూలీల కష్టాలు
పని ప్రదేశంలో ఎఫ్‌ఆర్‌సీకి తంటాలు
మహబూబాబాద్, మే 28(విజయక్రాం తి): ఉపాధి హామీ పథకం అమలులో అవకతవకలను అరికట్టేందుకు కొత్తగా ప్రవేశపె ట్టిన ఫేస్ రికగ్నైజేషన్ యాప్ కూలీలకు సరికొత్త కష్టాలను తెచ్చిపెడుతోంది. ముఖ కవళి కల్లో ఏమాత్రం మార్పు కనిపించినా ఎఫ్‌ఆర్‌సీ స్వీకరించకపోవడంతో కూలీలు పని ప్ర దేశంలో హాజరు నమోదు కోసం అనేక తం టాలు పడాల్సి వస్తోంది. కొన్నిచోట్ల ముఖానికి పౌడర్ అడ్డుకోవడం, మసి పూసుకోవ డం, అనేక చిత్రమైన చర్యలు చేపట్టాల్సి వ స్తోంది. ఇలాంటి ఘటనే ఒకటి గురువారం మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం కోమటిపల్లిలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఉపాధి కూలీ మల్యాల శ్రీని వాస్ గత వారం ఈ కేవైసీ చేయించుకొని కూలి పనికి వెళ్లాడు.
రెండు రోజుల క్రితం కొండగట్టు అంజన్న దర్శనానికి వెళ్లి తలనీలాలు సమర్పించాడు. ఈ క్రమంలో గురు వారం ఉపాధి పనికి హాజరయ్యాడు. మేట్ శ్రీనివాస్ హాజరును నమోదు చేయడానికి సెల్ ఫోన్ ఓపెన్ చేసి యాప్ ద్వారా ఫొటో తీయడానికి ఎంత ప్రయత్నించినా నమోదు కాకుండా తిరస్కరణకు గురైంది. దీంతో అత డు తన పక్కనే ఉన్న సోదరి కొమురమ్మ జు త్తును తలపై కప్పుకొని తిరిగి ఫొటో దిగగా వెంటనే ‘సక్సెస్’ అంటూ నమోదు చేసింది. జుట్టు లేకపోవడంతో చాలాసేపటి వరకు అ తని హాజరు నమోదు కాలేదు.ఈ విషయా న్ని గ్రహించిన శ్రీనివాస్ చిట్కా ప్రయోగంతో సక్సెస్ అయ్యాడు. ఉపాధి కూలీలకు ఎఫ్‌ఆర్ సీ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.






