calender_icon.png 15 November, 2025 | 1:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇకనుంచి గెలుపు గుర్రాలు బీసీలే

15-11-2025 12:06:15 AM

-రాష్ట్రంలో మా రాజకీయ ప్రభంజనం మొదలైంది

-మాకు టికెట్ ఇవ్వనందుకే బీఆర్‌ఎస్ ఓటమి 

-బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్

హైదరాబాద్, నవంబర్ 14 (విజయక్రాంతి) : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీసీ సా మాజిక వర్గానికి చెందిన నవీన్ యాదవ్ అఖండ మెజార్టీతో గెలవడం పట్ల బీసీ సంక్షే మ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. ఇది బీసీల గెలుపుగా తాము భావిస్తున్నామని అన్నారు.

శుక్రవారం జూబ్లీహిల్స్ ఎన్నికలపై హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మా ట్లాడారు. నవీన్ యాదవ్ గెలవడం ద్వారా రాష్ట్రంలో బీసీల రాజకీయ ప్రభంజనం ప్రా రంభమైంది.. నవీన్ యాదవ్ గెలుపు బీసీల రాజకీయాలకు మలుపు అని అన్నారు. గతంలో బీసీలకు బీఫామ్‌లు ఇస్తే ఓడిపోతారని, అగ్రకులాలకు టికెట్లు ఇస్తే గెలుస్తారని, ప్రతి ఎన్నికలలో గెలుపు గుర్రాలు అగ్రకులాలే అంటూ అన్ని రాజకీయ పార్టీలు పోటీపడి వారికి టికెట్లు ఇచ్చేవారు, ఇక ఈరోజు నుంచి గెలుపు గుర్రాలు బీసీలే అని నవీన్ యాదవ్ గెలుపు ద్వారా రుజువైందన్నారు.

ఈ ఎన్నికల్లో మూడు ప్రధాన పార్టీల నుంచి పోటీ జరిగితే ఇద్దరు అగ్రకులాలతో పోరాడి ఒక బీసీ బిడ్డ విజయం సాధించడం బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల రాజకీయ చైతన్యానికి నిదర్శనం అన్నారు. బీసీ రిజర్వేషన్ల చట్టాన్ని బీజేపీ ప్రభుత్వం ఆమో దించాలని బీసీలు మొరపెట్టుకున్నా.. బీసీల ఆకాంక్షలను గౌరవించని బీజేపీకి ఎన్నికల్లో డిపాజిట్లు కూడా గల్లంతయాయని అన్నా రు. బీఆర్‌ఎస్ కూ డా వారసత్వ రాజకీయాలకు పెద్దపీట వేస్తూ బీసీలకు టికెట్ ఇవ్వ కుండా మరొకసారి అగ్రకులాలకు టికెట్ ఇవ్వడం వలన గెలవాల్సిన సిట్టింగ్ సీటు ఓడిపోయింది అన్నారు.

కాంగ్రెస్ పార్టీ కూడ బీసీ అభ్యర్థికి ఎన్నికల్లో టికెట్ ఇవ్వడం మూ లంగానే గెలిచిందన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలను విశ్లే షించుకుని  మెజార్టీ ప్రజలైన బీసీలకు ఇక నుంచి జరిగే ఏ ఎన్నికైన అన్ని రాజకీయ పార్టీలు బీసీలకే టికెట్లు ఇవ్వాలని, లేకుంటే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పట్టిన గతే బీసీ వ్యతిరేక పార్టీలకు పడుతుందని ఆయన హెచ్చరించారు. జూ బ్లీహిల్స్ ఎన్నికల్లో అఖండ విజ యం సాధించిన నవీన్ యాదవ్‌కు, బీసీ బిడ్డకు అండగా నిలిచిన బీసీ,ఎస్సీ ఎస్ట, మైనార్టీ, అగ్రకుల పేదలకు జాజుల శ్రీనివాస్ గౌడ్ అభినందనలు తెలిపారు.