15-11-2025 12:05:47 AM
యువతకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి పిలుపు
ఆదిలాబాద్, నవంబర్ 14 (విజయ క్రాం తి) : యువత ర్యాగింగ్ , డ్రగ్స్‌కు అలవాటు పడి తమ బంగారు భవిష్యత్తును అంధకారం చేసుకోవద్దని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కే. ప్రభాకర్ రావు సూచించారు. ఆదిలాబాద్ రిమ్స్ ఆడిటోరియంలో శుక్రవారం నిర్వహించిన న్యాయ అవగాహన సదస్సులో ర్యాగింగ్, డ్రగ్స్, మత్తు పదార్థాల ప్రమాదాలపై అధికారులు విద్యార్థులకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమానికి జిల్లా జిల్లా కలెక్టర్ రాజర్షి షా, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ లతో కలిసి జిల్లా ప్రధాన న్యాయమూర్తి జ్యోతి ప్రజ్వలనతో సదస్సును ప్రారంభించారు. ఈ సం దర్భంగా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడు తూ... ర్యాగింగ్, డ్రగ్స్ వంటి దురలవాట్లు యువత జీవితాన్ని అంధకారంలోకి తీసుకెళ్తాయన్నారు. చట్టపరంగా ఇవి తీవ్రమైన నేరాలు. కఠిన శిక్షలు ఉంటాయి అని హెచ్చరించారు.
మత్తు పదార్థాల వల్ల కలిగే శారీరక, మానసిక నష్టాలను వివరించి, విద్యార్థులు నేరాలకు దూరంగా ఉండాలని సూచించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... మంచి అలవాట్లు, మంచి స్నేహాలు, మంచి లక్ష్యాలు మాత్రమే ఉజ్వల భవిష్యత్తుకి దారితీస్తాయన్నారు. దురలవాట్లకు దూరంగా ఉంటేనే జీవితంలో ఎదగవచ్చన్నా రు. మత్తు పదార్థాలపై పోలీసులు కఠిన చర్య లు తీసుకుంటున్నందున విద్యార్థులు జాగ్రత్త లు పాటించాలని చెప్పారు.
ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు అలవాటు పడి యువత తమ జీవితాలను అంధకారం చేసుకున్నారని పలు సంఘటనలు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి సి.ఎం. రాజ్యలక్ష్మి, రిమ్స్ సంచాలకులు డా.జైసింగ్ రాథోడ్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు నాగేశ్, రిమ్స్ బోధనభో దనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.