15-11-2025 12:06:41 AM
మంచిర్యాల, నవంబర్ 14 (విజయక్రాం తి): జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో శుక్రవారం బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడు తూ రేపటి తెలంగాణ భవిష్యత్తు నేటి బాలలపై ఆధారపడి ఉందన్నారు.
2047 రైసింగ్ తెలంగాణ విజన్‌లో పిల్లల పాత్ర అత్యంత కీలకమైందని, పిల్లలకు రాజ్యాంగం చట్టపరమైన హక్కు లను కల్పించిందని, వీటిపై బాలలు అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ కట్ చేసి బాలలకు జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి రౌఫ్‌ఖాన్, షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి చాతరాజుల దుర్గాప్రసాద్, జిల్లా మైనారిటీ సం క్షేమ అధికారి నీరటి రాజేశ్వరి, పశుసంవర్ధక శాఖ అధికారి శంకర్ పాల్గొన్నారు.