3 August, 2026 | 11:43 PM

మతపెద్ద నుంచి అధ్యక్షుడిగా..

21-05-2024 01:24 AM

ఇరాన్ అధ్యక్షుడి జీవితమంతా వివాదాలే

5 వేల మంది ఖైదీలకు మరణశిక్ష విధించినట్టు ఆరోపణ

దేశ మతపెద్ద ఖొమేనీకి నమ్మిన బంటుగా పేరు

టెహ్రాన్, మే 20: హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన ఇరాన్ అధ్యక్షుడు ఇబ్ర హీం రైసీకి స్వదేశంలో ఎంత గొప్ప పేరున్నదో అంతర్జాతీయ సమాజంలో అంత వివాదాస్పదుడిగా ముద్ర ఉన్నది. ఇజ్రాయెల్, ఇరాక్ వంటి ఇరాన్ ప్రత్యర్థి దేశాలు రైసీని కసాయి అని సంబోధిస్తాయి. ఈ యన మొదట న్యాయమూర్తిగా ఉండి... దేశ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖొమేనీ మద్దతుగా దేశాధ్యక్షుడు అయ్యారు. 1994లో రైసీ టెహ్రాన్‌లో ప్రాసిక్యూటర్‌గా జీవితం ప్రారంభించారు. రైసీ 1960లో మశ్శద్‌లో జన్మించారు. షాహిద్ మొతాహరీ యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేశారు.

షా ఆఫ్ ఇరాన్‌గా ఉన్న మొహమ్మద్ రెజా షా పహ్లవీకి వ్యతిరేకంగా ఇస్లామిస్టులు చేపట్టిన ఉద్యమంలో చిన్నతనంలోనే భాగస్వామి అయ్యా రు. అయతొల్లా రొహొల్లా ఖొమేనీ నాయకత్వంలో చెలరేగిన ఇస్లామిక్ విప్లవం కారణంగా 1979లో పహ్లవీ తన అధికారాన్ని కోల్పోయి దేశం విడిచి పారిపోయిన విష యం తెలిసిందే. అప్పటి నుంచి ఖొమేనీల కనుసన్నల్లోనే దేశం నడుస్తున్నది. ప్రస్తుత మతపెద్ద అయతొల్లా అలీ ఖొమేనీకి రైసీ నమ్మిన బంటుగా ముద్రపడ్డారు.

25 ఏండ్ల వయసులోనే టెహ్రాన్‌లో డిఫ్యూటీ ప్రాసిక్యూటర్‌గా నియమితుడైన రైసీ.. 1988లో నియమించిన ‘డెత్ కమిటీ’లోని నలుగురు న్యాయమూర్తుల్లో ఒకడిగా నియమితులయ్యారు. ఆ కమిటీ ఇరాన్ జైళ్లలో అక్రమం గా నిర్బంధించిన దాదాపు 5 వేల రాజకీయ, పౌర సంఘాల కార్యకర్తలు, నాయకులపై రహస్య విచారణ జరిపి మరణశిక్షలు విధించింది. ఈ విచారణ ప్రపం చవ్యాప్తంగా తీవ్ర విమర్శలకు గురైంది. మరణశిక్ష పడిన ఖైదీల్లో ఎక్కువ మంది వామపక్ష సంఘమైన ముజాహిద్ ఈ ఖల్క్ సభ్యులే. ఈ ఘటనతో రైసీ ‘టెహ్రాన్ కసాయి’ అని పేరు తెచ్చుకొన్నారు.

అయితే, ఆ విచారణలో తన పాత్రను ఆయన చనిపోయేవరకు తిరస్కరిస్తూనే వచ్చారు. ఆ తర్వాత ఆయన టెహ్రాన్ ప్రాసిక్యూటర్‌గా నియమితులయ్యారు. ఆ తర్వాత అనతికాలంలోనే ఇరాన్ ప్రధాన న్యాయమూర్తిగా ఎదిగారు. 2017లో తొలిసారి ఇరాన్ అధ్యక్ష పదవికి పోటీ పడ్డారు. కానీ, మొదటి ప్రయత్నంలో హస్సన్ రొహానీ చేతిలో ఓడిపో యారు. రెండో ప్రయత్నం లో 2021లో భారీ మెజారిటీతో అధ్యక్షుడిగా గెలుపొందారు. 

రైసీ పాలనలో ఇరాన్‌లో అలజడి

రైసీ అధికారం చేపట్టినప్పటి నుంచి ఇరాన్‌లో ఏదో ఒక మూల పౌర ఉద్యమాలు వస్తూనే ఉన్నా యి. 2022లో బురఖా సరిగ్గా ధరించలేదన్న కారణంతో 22 ఏండ్ల యు వతని పోలీసులు హింసించి చంపటంతో దేశ వ్యాప్తంగా భారీ ఉద్య మం చెలరేగింది. ఈయన పాలనా కాలంలో ఇతర దేశాలతో కూడా ఇరాన్ సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇజ్రాయెల్‌తో ఏకంగా యుద్ధమే జరిగింది. గత నెలలో ఇరు దేశాలు క్షిపణులు, సాయుధ డ్రోన్లతో దాడులు చేసుకొన్న విషయం తెలిసిందే. సౌదీ అరేబియా, లెబనాన్ వంటి దేశాలతో కూడా ఇరాన్ సం బంధాలు దెబ్బతిన్నాయి. అమెరికాతోయుద్ధవాతావరణంఏర్పడింది.