15 April, 2026 | 12:56 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

పోచారంలో దీక్షా దివాస్.. రోగులకు పండ్లు పంపిణీ

29-11-2025 08:42 PM

ఘట్ కేసర్ (విజయక్రాంతి): పోచారం మున్సిపల్ పరిధిలోని అన్నోజీగూడలో మున్సిపల్ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం దీక్షా దివస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటాపూర్ లోని నీలిమ హాస్పిటల్ లో రోగులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పోచారం మున్సిపల్ మాజీ చైర్మన్ బోయపల్లి కొండల్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అంటూ 2009 నవంబర్ 29 తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమ నేత కేసీఆర్ ఆ మరణ నిరాహార దీక్ష ప్రారంభంచిన రోజు తెలంగాణ రాష్ట్ర సాధనలో ముఖ్య భాగమని జై తెలంగాణ అనే నినాదం ప్రతి గుండెను తాకిందన్నారు.

కేసీఆర్ దీక్షా వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ చైర్మన్ రెడ్డియా నాయక్, పోచారం మున్సిపల్ పార్టీ ప్రధాన కార్యదర్శి నల్లవెళ్ళి శేఖర్, మాజీ కౌన్సిలర్ లు సింగిరెడ్డి సాయిరెడ్డి, చింతల రాజశేఖర్, మెట్టు బాల్ రెడ్డి, నాయకులు బద్దం జగన్ మోహన్ రెడ్డి,  నర్రి కాశయ్య, సామల బుచ్చిరెడ్డి, అకిటి బాల్ రెడ్డి, అబ్బావతి నర్సింహా, సామల సందీప్ రెడ్డి, కె.ఎం. రెడ్డి, మీసాల రాజేశ్, బోయపల్లి రాజేశ్వర్ రెడ్డి, పంగ అయోధ్య, సంతోష్ నాయక్, ఉసికె రాఘవేందర్ రెడ్డి, కొమ్ముల ప్రశాంత్, నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.