30 August, 2026 | 2:51 AM

ఇంగువ నాణ్యత డొల్ల

30-08-2026 01:33 AM

ఎవరెస్ట్, లాల్‌జీ గోధూ ఉత్పత్తులపై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ తాత్కాలిక నిషేధం

దేశవ్యాప్తంగా అమలు

గాంధీనగర్, ఆగస్టు ౨౯: ప్రముఖ ఆహార ఉత్పత్తి సంస్థలైన ఎవరెస్ట్, లాల్‌జీ గోధూ తయారు చేసే ఇంగువ నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా లేవని, కాబట్టి ఆయా సంస్థలకు సంబంధించిన ఇంగువ అమ్మకాలపై దేశవ్యాప్తంగా తాత్కాలిక నిషేధం విధిస్తున్నట్టు శనివారం భారత ఆహార భద్రత, ప్రమాణాల అథారిటీ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) ప్రకటించింది.

అంతేకాదు.. ఆయా సంస్థలు ఇప్పటికే మార్కెట్‌లోకి వదిలిన స్టాక్‌నంతా వెనక్కి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ముంబైతోపాటు గుజరాత్‌లోని ఉంబర్‌గావ్ ఎవరెస్ట్, లాల్ గోధూ తయారీ పరిశ్రమల నుంచి నమూనాలను సేకరించి పరీక్షించగా, ఇంగువ ఉత్పత్తిలో నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని గుర్తించామని తెలిపింది. నిబంధనలకు అనుగుణంగా ఉత్పత్తుల తయారీ ఉండేవరకూ నిషేధం కొనసాగుతుందని తేల్చిచెప్పింది.

నిబంధనల ప్రకారం కాంపౌండెడ్ ఇంగువలో 5 శాతం ఆల్కహాల్ -సాల్యూబుల్ ఎక్స్‌ట్రాక్ట్ ఉండాలని, తాము సేకరించిన ‘ఎవరెస్ట్’ నమూనాల్లో అది కేవలం 0 3 శాతం మాత్రమే ఉన్నట్లు తేలిందని వెల్లడించింది. అలాగే, లాల్‌జీ గోధూ పరిశ్రమ నుంచి సేకరించిన ఆరు రకాల ముడి ఇంగువలో 15 32 శాతం పిండి పదార్థం (స్టార్చ్) ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. సాధారణంగా ఇది 1 శాతం కన్నా ఎక్కువ ఉండకూడదని వివరించింది. ఎవరెస్ట్‌కు చెందిన ఎగ్ కర్రీ మసాలా, చికెన్ మసాలా, గరం మసాలాల్లో కూడా ప్రమాణాల లోపాన్ని గుర్తించామని, ఈ మూడు ఉత్పత్తుల్లో నిబంధనల ఉల్లంఘన జరిగినప్పటికీ, అయితే.. వీటి అమ్మకాలపై ఎలాంటి నిషేధం లేదు.