30 March, 2026 | 2:38 AM

యుద్ధంతో ఇంధన సంక్షోభం

30-03-2026 12:49 AM
  1. ఇంధన అవసరాలకు కేంద్ర బిందువు పశ్చిమాసియా

అంతర్జాతీయ సంబంధాల వల్ల సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాం

భారతీయులకు అండగా నిలుస్తున్న గల్ఫ్ దేశాలకు కృతజ్ఞతలు

పుకార్లను నమ్మొద్దు, స్వార్థ రాజకీయాలకు సమయం కాదు

132 మన్ కీ బాత్‌లో ప్రధాని నరేంద్ర మోదీ

న్యూ ఢిల్లీ, మార్చి 29: పశ్చిమాసియాలో యుద్ధంతో ప్రపంచ వ్యాప్తంగా ఇంధన సంక్షోభం ఏర్పడే అవకాశం ఉందని ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. యుద్ధం జరుగుతున్న ప్రాంతం అంతర్జాతీయ ఇంధ న అవసరాలకు కేంద్రబిందువన్నారు. మన్ కీ బాత్ 132వ కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోదీ ఆదివారం దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడారు.

అయితే దశాబ్ద కాలంగా భారత్ నిర్మించుకున్న అంతర్జాతీయ సంబంధాల వల్ల ఇంధన సంక్షోభాన్ని ధీటుగా ఎదుర్కొంటున్నామని చెప్పారు. ఈ ఏడాది మార్చి అంతర్జాతీయంగా అత్యంత కల్లోల భరితంగా మారిందని ప్రధాని పేర్కొన్నారు. కోవిడ్ తరువాత ప్రపంచం కోలుకుంటుందని ఆశించిన తరుణంలో ఈ యుద్ధాలు మొదలవ్వడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

యుద్ధం వల్ల కోటి మందికి పైగా భారతీయులు నివసిస్తున్న గల్ఫ్ దేశాలపై ప్రభావం పడిందన్నారు. అక్కడ ఉన్న భారతీయులకు అండగా నిలుస్తున్న గల్ఫ్ దేశాలకు కృతజ్ఞతలు తెలిపారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా ఈ అంశంపై ఎవరూ రాజకీ యం చేయవద్దని మోదీ కోరారు. 140 కోట్ల భారతీయుల ప్రయోజనాలే ముఖ్యమని, స్వార్థ రాజకీయాలకు ఇది సమయం కాదని హితవు పలికారు.

సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారాలు, సమాచారం, పుకార్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. 140 కోట్ల మంది ప్రజల ప్రయోజ నాలకు సంబంధించిన విషఁమన్నారు. ఇక్కడ స్వార్థపూరిత రాజకీయాలకు తావులేదన్నారు. క్లిష్ట సమయంలో దేశ ప్రజలంతా ఐక్యతతో ఉండాలని విజ్ఞప్తి చేశారు. ప్రభు త్వం పంచుకునే అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలను కోరారు.