calender_icon.png 15 February, 2026 | 2:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్‌కు సంపూర్ణ ప్రజామద్దతు

15-02-2026 12:58:03 AM

మున్సిపల్ ఫలితాలే అందుకు నిదర్శనం

సీఎం రేవంత్‌రెడ్డికి కాంగ్రెస్ జాతీయ నాయకుల అభినందనలు

ఫలితాలు ప్రజావిశ్వాసాన్ని ప్రతిబింబిస్తున్నాయి : ఖర్గే

ఆత్మగౌరం, అభివృద్ధికి ఆమోద ముద్ర : రాహుల్ గాంధీ

హైదరాబాద్, ఫిబ్రవరి 14 (విజయక్రాంతి): సంక్షేమం, అభివృ ద్ధి, సుస్థిర పరిపాలన, సామాజిక సాధికారత కోసం స్పష్టమైన లక్ష్యాలతో ముందుకు సాగుతున్న తెలం గాణ ప్రభుత్వానికి ప్రజల నుంచి సంపూర్ణ మద్దతుకు ఈ ఫలితాలు నిదర్శనంగా నిలుస్తాయని కాంగ్రెస్ జాతీయ నేతలు అభిప్రాయపడ్డా రు.

తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడంపై సీఎం రేవంత్‌రెడ్డికి పార్టీ జాతీయ నాయకత్వం నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. పార్టీ జాతీయ నాయకులతో పాటు పలు రాష్ట్రాలకు చెందిన నేతలు రేవంత్ రెడ్డితో ఫోన్‌లో మాట్లాడి అభినందనలు తెలిపారు. ఈ ఫలితాలు కాంగ్రె స్ ప్రభుత్వం పట్ల ప్రజలకున్న విశ్వాసాన్ని ప్రతిబింబిస్తున్నాయని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. సామాజిక న్యాయం, ఆర్థిక సాధికారత, రాష్ట్ర ప్రజల పురోభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని ఖర్గే ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.

సామాజిక న్యా యం, ఆత్మగౌరవం, సమ్మిళిత వృద్ధి కోసం పనిచేస్తున్న కాంగ్రెస్‌కు తెలంగాణ ప్రజలు స్థానిక ఎన్నికల్లో స్పష్టమైన ఆమోదముద్ర వేశారని లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలిపారు. స్థానిక ఎన్నికల్లో విజయం కోసం కృషి చేసిన కార్యకర్తలు, నాయ కులకు రాహుల్ గాంధీ హదయపూర్వక అభినందనలు తెలియజేశారు. లోక్‌సభ సభ్యురాలు, ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సీఎం రేవంత్‌రెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు. ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న నమ్మకానికి ఈ ఫలితాలు ప్రతిబింబిస్తున్నాయని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. 

రాష్ర్టంలో ప్రతి కుటుంబం అభివృద్ధి దిశగా సుసంపన్నమైన తెలంగాణను నిర్మించాలన్న కాంగ్రెస్ సంకల్పానికి ఈ విజయం మరింత బలాన్ని చేకూరుస్తుందని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఈ ఘన విజయం కాంగ్రెస్ నమూనా పరిపాలనకు ప్రజలు ఇచ్చిన ఆమోదమని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ అభివర్ణించారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బలమైన నాయకత్వం, పార్టీతో సమన్వయంతో ఈ ఘన విజయం సాధ్యమైందని ఎంపీ, లోక్‌సభలో కాంగ్రెస్ విప్ మాణిక్కం ఠాగూర్ పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీపై ప్రజలు సంపూర్ణ విశ్వాసం ఉంచారని ఈ ఎన్నికలు రుజువు చేస్తున్నాయని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ కోశాధికారి విజయ్ వసంత్ తెలిపారు. ఎన్నికల్లో ఘన విజయం సాధించినందుకు రేవంత్ రెడ్డికి అభినందనలు తెలియజేస్తూ, ప్రభుత్వ పనితీరుకు ప్రజల ఆమోదానికి ఇది నిదర్శనమని ఆల్ ఇండియా కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి సచిన్ సావంత్ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.  రాజ్యసభ సభ్యుడు అభిషేక్ సింఘ్వి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలకు అభినందనలు తెలిపారు.