calender_icon.png 15 February, 2026 | 2:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

30 మున్సిపాలిటీలు గెలుస్తామనుకున్నాం

15-02-2026 01:00:27 AM

హంగ్ ఏర్పడిన చోట మాకూ విజయావకాశాలు 

కాంగ్రెస్‌వి గాల్లో మేడలు.. వారికి ఆశించిన స్థానాలు రాలే 

కరీంనగర్, నిజామాబాద్ మినహా బీజేపీ ప్రభావం లేదు

ఎక్స్‌అఫీషియో సభ్యుల నిబంధనలపై ప్రభుత్వానికే స్పష్టత లేదు

తమాషా కోసమే మరోసారి ఫార్ములా కేసు విచారణ

చిట్‌చాట్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్, ఫిబ్రవరి 14 (విజయక్రాంతి): ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 30 మున్సిపా లిటీలకు పైగా గెలుస్తామనుకున్నామని, కానీ కొన్ని స్థానాలు తగ్గాయని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కానీ వచ్చిన 17 మున్సిపాలిటీలతో పాటు హంగ్ ఏర్పడిన మున్సిపాలిటీల్లో కూ డా మాకూ విజయావకాశాలు ఉన్నాయని ధీమా వ్యక్తం చేశారు.

వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ పార్టీ అసంతృప్తిగానే ఉందని, గాల్లో మేడలు కట్టిం ది కానీ, క్షేత్రస్థాయిలో ప్రజలు వారికి ఆశించినన్ని స్థానాలు ఇవ్వలేదని తెలిపారు. శనివారం నం దినగర్ నివాసంలో కేటీఆర్ మీడియాతో చిట్‌చాట్ నిర్వహించి మాట్లాడారు. ఎక్స్ అఫీషియో సభ్యులకు సంబంధించిన నిబంధనల విషయంలో ప్రభుత్వానికి కూడా స్పష్టత లేదన్నారు. చైర్మన్ పీఠాలను దక్కించుకోవడంలో కీలకమైన ఎక్స్ అఫీషి యో ఓట్ల నమోదు విషయంలో ఇప్పటికే ఎస్‌ఈసీ అధికారులతో చర్చించామని తెలిపారు. 

స్థానిక సంస్థల్లో అధినేతలతో ప్రయోజనం ఉండదు

మున్సిపల్ ఎన్నికల్లో మా పార్టీ కార్యకర్తలు అద్భుతంగా పోరాటం చేశారని అభినందించారు. కరీంగనర్, నిజామాబాద్ మినహా రాష్ట్రంలో ఎక్క డా బీజేపీ ప్రభావం శూన్యమని, అయినా బీజేపీ ఎందుకు వాళ్ల పర్ఫార్మెన్స్ బాగుంది అని చెప్పుకుంటుందో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. వారికి గతంలో కంటే తక్కువ ఓట్లు, వార్డులు వచ్చాయని, బీజేపీ జాతీయ అధ్యక్షుడిని తెచ్చి ప్రచారం చేసింది, కానీ ఫలితాలు మాత్రం ఏ విధంగా వచ్చాయో అందరూ చూశారని తెలిపారు. ఒక ముఖ్యమంత్రి, జాతీ య అధ్యక్షుడు వచ్చినా ఒక్క మున్సిపాలిటీ కూడా బీజేపీ గెలవలేకపోయిందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అధినేతలు తిరిగితే పెద్ద ప్రయోజనం ఏ ముండదని చెప్పారు.  

స్థానిక పరిస్థితులను బట్టే పొత్తులు 

స్థానిక సంస్థల ఎన్నికల్లో లోకల్ అంశాలు, ప్రభు త్వ అధికారంలో ఉన్నవాళ్లకి సాధారణంగా అనుకూలంగా ఉంటాయని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్ని కల్లో కూడా విపరీతంగా డబ్బు ప్రభావం పెరిగిపోయిందని, కాంగ్రెస్ విచ్చలవిడిగా ఖర్చు చేసిందని ఆరోపించారు. ఫలితాలు గొప్పగా రాని జిల్లాల్లోనూ మా పార్టీ శ్రేణులు అద్భుతమైన పోరాటం చేశాయన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మాపార్టీ సంతృప్తిక రమైన పోరాటం చేసిందని పేర్కొన్నారు. గతంలో పార్లమెంట్ ఎన్నికల తర్వాత అడ్డగోలుగా మాట్లాడిన వాళ్లందరికీ ఈ ఎన్నికలే సమాధానమన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికలు కాబట్టి అక్కడి పరిస్థితులను బట్టే పొత్తులు ఉంటాయని స్పష్టం చేశారు. ఈ ఫలితాల ప్రభావం అసెంబ్లీ ఎన్నికలపై ఉండదని, ఆంధ్రప్రదేశ్ ఫలితాలే దీనికి స్పష్టమైన ఉదాహరణ అని వివరించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ కేవలం కాంగ్రెస్ నాలుగు మున్సిపాలిటీలు మాత్రమే గెలిచిందని గుర్తు చేశారు. రేవంత్‌రెడ్డి మల్కాజ్‌గిరి ఎంపీగా, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు జీహెచ్‌ఎంసీలో ఎన్ని గెలిచారని ప్రశ్నించారు. ఇప్పుడు మేము ఎన్ని గెలిచామో ప్రజలు ఇవన్నీ చూస్తూనే ఉన్నారని తెలిపారు. 

జైలులో పెట్టినా భయపడం

ఫార్మలా కేసులో ఎన్నిసార్లు పిలిచి నా.. విచారణ జరిపినా ఇబ్బందేమీ లేదని.. ఆఖరికి జైలులో పెట్టినా భయయపడేది లేద ని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్ప ష్టం చేశారు. మరోసారి ఫార్ములా ఈ అనే అంశాన్ని ప్రభుత్వం తెర మీదికి తీసుకొస్తున్నదని, ఇప్పటికే నాలుగు సార్లు పిలిచి వాళ్లు చేసింది ఏమీ లేదని విమర్శించారు. కేవలం మరోసారి తమాషా కోసమే పిలవబోతున్నారన్న సమాచారం ఉందన్నారు. ఆ కేసులో ఎలాంటి పస లేదనే విషయాన్ని పోలీస్, ఏసీ బీ అధికారులు ముఖ్యమంత్రికి ఇప్పటికే పలుమార్లు చెప్పారని ఎద్దేవా చేశారు.