5 May, 2026 | 7:43 PM

ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభకు సంపూర్ణ మద్దతు

05-05-2026 06:27 PM

అడిషనల్ స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్ నరేష్ కుమార్ నర్సింగోజు

మేడిపల్లి,(విజయక్రాంతి): పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాలలో భాజపా ఘన విజయాన్ని నమోదు చేసిన సందర్భంగా మేడిపల్లి లోని ఉప్పల్ కోర్ట్ కాంప్లెక్స్ యందు  భాజపా లీగల్ సెల్ న్యాయవాదులు మట్టపల్లి శ్రీనివాస్, అడిషనల్ స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్  నరేష్ కుమార్ నర్సింగోజు ఆధ్వర్యంలో న్యాయవాదులు స్వీట్లు పంచుతూ విజయోత్సవాలు ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ అడిషనల్ స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్ నరేష్ కుమార్ నర్సింగోజు మాట్లాడుతూ... మే 10న సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో  జరగబోయే భారత ప్రధాని నరేంద్ర మోడీ భారీ బహిరంగ సభకు న్యాయవాదులంతా సంపూర్ణ మద్దతు ప్రకటించారు. దేశ అభివృద్ధి కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని మద్దతు ప్రకటించాలని తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రంగు శ్రీకాంతుడు, బజార్ కిరణ్ గౌడ్,రవి గౌడ్, బోరంపేట వంశీకృష్ణ, చంద్రశేఖర్, రాజేందర్, భారత్, సాయిలు తదితరులు పాల్గొన్నారు.