సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు
ముకరంపుర,(విజయక్రాంతి): పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న 376 జయంతి వేడుకలు బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన నాయకులు దొగ్గలి శ్రీధర్ , వాయిల రాజకుమార్ , మంద వెంకన్న , భార్గవి , సంధ్యా గౌడ్ పాల్గొని విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం అలుగునూరులో నిర్వహించిన 376వ జయంతి ఉత్సవ సభలో మాట్లాడుతూ కులవృత్తితో తృప్తి చెందక బహుజన సమాజానికి సేవ చేయాలనే కాంక్షతో12 మంది సైన్యంతో మొఘల్ సైన్యాన్ని ఓడించి, గోల్కొండ కోట ఔరంగజేబు సేనలు పారిపోయే లా చేసి, గోల్కొండ నుంచి దాదాపు ఏడాది ఏలుబడి సాగించి, తన సొంత స్థానం ఖిలేషాపురం లో కొత్త గా కోటను కట్టి, కాకతీయులను కట్టడి చేసి, భువనగిరి, హుస్నాబాద్ ప్రాంతాలను తన పాలనలోకి తెచ్చిన సాహసి.తొలి బహుజన చక్రవర్తి మహరాజ్ సర్దార్ సర్వాయి పాపన్న జయంతి శుభాకాంక్షలు తెలిపారు. గోల్కొండ కోట పైన మొట్టమొదటి సారి తెలంగాణ ప్రాంత ఔన్నత్యాన్ని చాటి, మన భూమి, మన పాలన, మన ఉనికిని కాపాడిన వీరుడి ఆశయం స్ఫూర్తిని పొందుదాం అని అన్నారు.






