18 August, 2026 | 1:21 PM

Breaking News

భూములను భూమాఫీయాకు కట్టబట్టే కుట్ర   •   ఎస్సీ, బీసీల భూములను ప్రభుత్వం లాక్కుంటోంది   •   ప్రభుత్వం తప్పు చేసి.. ప్రజలకు ఎందుకు శిక్ష?   •   ఫర్నిచర్ షాప్‌లో అగ్నిప్రమాదం.. కార్మికుడి సజీవదహణం   •   కస్తూర్బా బాలికల ఆశ్రమ పాఠశాలలో ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆకస్మిక తనిఖీ   •   ఖర్గేను అవమానిస్తారా.. బీజేపీ వైఖరిపై టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీను బాబు ఫైర్   •   రోడ్డు కోసం పొలం పోతుందని రైతు ఆత్మహత్యాయత్నం   •   గ్రామ గ్రామాన జల సంరక్షణ పనులు చేపట్టండి   •   అక్రమంగా నిల్వ ఉంచిన పిడిఎస్ రైస్ పట్టివేత   •   ప్రజా సమస్యలు పరిష్కరించాలని ఎంఎంసి కమిషనర్‌కు వినతి   •  

సహకార సంఘాల పాత పాలకవర్గం సభ్యులు తిరిగి బాధ్యతలు స్వీకరణ

05-05-2026 06:29 PM

ఆర్డర్ కాపీని అందజేసిన సొసైటీ సీఈవో

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): గత డిసెంబర్ నెల 19వ తేదీన సింగల్ విండో పాలకవర్గాలను రద్దు చేస్తూ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉత్తర్వులు జారీ విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయంపై పలువురు సింగిల్ విండో చైర్మన్లు హైకోర్టును ఆశ్రయించడంతో పాత పాలకవర్గ సభ్యులకు పదవి బాధ్యతలు అప్పగించాలని హైకోర్టు తీర్పు ఇవ్వడంతో జిల్లా సహకార సంఘాధికారి రామ్మోహన్ రావు ఆదేశాల మేరకు మండలంలోని తాండూర్ కిచ్చన్నపేట సహకార సంఘం అధ్యక్షులు పాలకవర్గం సభ్యులు బాధ్యతలు స్వీకరించారు.

తాండూర్ కిచ్చన్నపేట సహకార సంఘం అధ్యక్షులుగా,పాలకవర్గం సభ్యులుగా తిరిగి పాత వర్గం సభ్యులకు బాధ్యతలు స్వీకరించాలని ఆదేశాలు రావడంతో అట్టి ఆదేశాల మేరకు గతంలో తాండూర్ సొసైటీ సహకార సంఘం  అధ్యక్షులుగా వ్యవహరించినటువంటి ఆకిడి గంగారెడ్డికి, పాలకవర్గం సభ్యులకు బాధ్యతలు అప్పగిస్తూ ఆర్డర్ కాపీని అందజేయడం జరిగిందని సీఈవో మురళి తెలిపారు. గతంలో తాండూర్ సొసైటీ పాలకవర్గం ఏవిధంగా బాధ్యతలు చేపట్టారో వారికి తిరిగి ఉన్నత అధికారుల ఆదేశానుసారం ఆర్డర్ కాపీని అందించి బాధ్యతలు అప్పజెప్పినట్లు సొసైటీ సీఈవో మురళి తెలిపారు.