కల్తీ నెయ్యి తయారీ కేంద్రంపై హెచ్-ఫాస్ట్ అధికారులు దాడి
18-08-2026 01:55 PM
హైదరాబాద్: కల్తీ నెయ్యి తయారీ కేంద్రంపై హైదరాబాద్ ఫుడ్ అడల్టరేషన్ సర్వైలెన్స్ టీమ్' (H-FAST) అధికారులు దాడులు నిర్వహించారు. కల్తీ నెయ్యి తయారీకి వాడుతున్న 10.5 టన్నుల ముడి పదార్థాలను సీజ్ చేసి, తనిఖీల్లో దాదాపు 25.5 టన్నుల కల్తీ నెయ్యిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో నెయ్యి తయారీ, విక్రయ కేంద్రాలపై ఇటీవల చేపట్టిన ప్రత్యేక తనిఖీలకు సంబంధించిన వివరాలను హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ వెల్లడించనున్నారు






