18 August, 2026 | 1:38 PM

Breaking News

భూములను భూమాఫీయాకు కట్టబట్టే కుట్ర   •   ఎస్సీ, బీసీల భూములను ప్రభుత్వం లాక్కుంటోంది   •   ప్రభుత్వం తప్పు చేసి.. ప్రజలకు ఎందుకు శిక్ష?   •   ఫర్నిచర్ షాప్‌లో అగ్నిప్రమాదం.. కార్మికుడి సజీవదహణం   •   కస్తూర్బా బాలికల ఆశ్రమ పాఠశాలలో ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆకస్మిక తనిఖీ   •   ఖర్గేను అవమానిస్తారా.. బీజేపీ వైఖరిపై టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీను బాబు ఫైర్   •   రోడ్డు కోసం పొలం పోతుందని రైతు ఆత్మహత్యాయత్నం   •   గ్రామ గ్రామాన జల సంరక్షణ పనులు చేపట్టండి   •   అక్రమంగా నిల్వ ఉంచిన పిడిఎస్ రైస్ పట్టివేత   •   ప్రజా సమస్యలు పరిష్కరించాలని ఎంఎంసి కమిషనర్‌కు వినతి   •  

ఎస్సీ, బీసీల భూములను ప్రభుత్వం లాక్కుంటోంది

18-08-2026 12:50 PM

హైదరాబాద్: సామాజిక న్యాయం పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. మంత్రివర్గంలో కేవలం ముగ్గురే బీసీలు ఉండటం సామాజిక న్యాయమా? అని ప్రశ్నించారు. ప్రభుత్వ సలహాదారుల నియామకాల్లోనూ విపక్ష చూపుతున్నారని, ఆర్టీఐ కమిషనర్లలో ఒక్క బీసీకి కూడా చోటు కల్పించలేదని మండిపడ్డారు. మంత్రుల కుటుంబ సభ్యులు, రాజ్యాంగేతర శక్తులు రాష్ట్ర పాలనను శాసిస్తున్నాయని, 22ఏను అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ నేతలు భూ దోపిడికి పాల్పడుతున్నారని కవిత విమర్శించారు. ఎస్సీ, బీసీల నుంచి 30 వేల ఎకరాల అసైన్డ్ భూములను ప్రభుత్వం లాక్కుంటోందని, ధరణి, భూభారతి రికార్డులను ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ఆమె వెల్లడించారు.