26 March, 2026 | 2:33 AM

దోమడుగు అభివృద్ధికి సంపూర్ణ సహకారం

26-03-2026 12:44 AM
  1. రూ.79 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

పటాన్చెరు ఎమ్మెల్యే జీఎంఆర్

గుమ్మడిదల, మార్చి 25 :గుమ్మడిదల మున్సిపల్ పరిధిలోని దోమడుగు వార్డులో హెట్రో డ్రగ్స్ పరిశ్రమ సౌజన్యంతో(సిఎస్‌ఆర్) 79 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు,అంతర్గత మురుగునీటి కాలువలు,రక్షిత మంచినీటి పైపులైన్ల నిర్మాణ పనులకు బుధవారం ఎమ్మెల్యే జిఎంఆర్ హాజరై శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుమ్మడిదల మున్సిపల్ అభివృద్ధి కోసం ఇప్పటికే 15 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయి అని తెలిపారు.అతి త్వరలో ఇందుకు సంబంధించిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయబోతున్నట్లు తెలిపారు.

రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు.అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. గ్రామాల అభివృద్ధికి పరిశ్రమల యాజమాన్యాలు సంపూర్ణ సహకారం అందించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లోనూ అభివృద్ధి కార్యక్రమాలలో భాగస్వామ్యం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కుమార్ గౌడ్, వైస్ చైర్మన్ సంధ్యా గోవర్ధన్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ దశరథ్, హెట్రో డ్రగ్స్ పరిశ్రమ ప్రతినిధులు సుధాకర్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, దోమడుగు కౌన్సిలర్లు అబిశెట్టి రాజశేఖర్, మద్ది సోనీ శేఖర్ రెడ్డి, నర్సంపల్లి రాజిరెడ్డి, బ్యాగరీ వరలక్ష్మి కృష్ణ, ఆయా మున్సిపల్ కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.