నిధులున్నా అభివృద్ధి శూన్యం
రానున్న రోజుల్లో మునుగోడు ఎడారి కాబోతుంది
మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
చండూరు, మార్చి 29: సాగునీరు అందక రానున్న రోజుల్లో మునుగోడు ఎడారిగా మారుతుందని, నిధులు ఉన్న మునుగోడు ప్రాంతం అభివృద్ధిలో శూన్యమని మునుగోడు మాజీ శాసనసభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం చండూరులో విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలలో కాలువల ద్వారా గాని ప్రాజెక్టులో ద్వారా గాని సాగునీరు అందుతుందన్నారు.
ఇతర ప్రాజెక్టు నుండి మునుగోడు కు కాలువలు లేవు అలాగే ఇక్కడ ఒక ప్రాజెక్టు కూడా లేదని అందువల్ల ఒక్క ఎకరాన్ని కూడా సాగునీరు అందడం లేదు అని అన్నారు. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునర్నిర్మాణం చేయడం వల్ల చెరువులు నిండి భూగర్భ జలాలు పెరగడం వల్ల బోర్లలో నీళ్లు వచ్చి రైతులు కొంత వ్యవసాయం చేసుకున్నారని, ఎదుళ్ల నుండి వచ్చే నీటి పంపకాల్లో మునుగోడుకు అన్యాయం జరుగుతుందన్నారు.
మనకు వచ్చే 0.5 టీఎంసీలకు 436 అడుగుల వద్ద రెగ్యులేటర్ ఏర్పాటు చేయాలని,436 మీటర్ల నుండి 440 కి పెంచడం వల్ల మునుగోడుకు చుక్క నీరు కూడా రాదని అన్నారు.నీటీ పంపకాల విషయంలో ప్రభుత్వం సమతుల్యం పాటించాలన్నారు. మునుగోడుకు నీళ్లు రానప్పుడు వేల కోట్లతో నిర్మించిన శివన్న గూడెం,లక్ష్మణా పురం ప్రాజెక్ట్ ల పరిస్థితి ఆగమ్యచొర్యంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మునుగోడు నీళ్ల విషయంలో అన్యాయం జరుగుతుంటే స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంత్రి పదవి కోసం మునుగోడు ప్రజల జీవనాధారమైన సాగునీటి ప్రాజెక్టును పణంగా పెట్టొద్దని,మనం అడగకపొతే ఇప్పుడు నాగార్జున సాగర్ కుడి కాల్వ నీళ్లు పోతుంటే ఎడమకాల్వ విషయంలో ఎలా అన్యాయం జరుగుతుందో అలానే జరగబోతుందన్నారు. 436 అడుగుల వద్ద రెగ్యులేటర్ ను పెట్టమని ప్రభుత్వాన్ని కోరమని స్థానిక ఎమ్మెల్యే కు నేను విన్నపం చేస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో చండూరు మండల బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు బొమ్మరబోయిన వెంకన్న, పట్టణ అధ్యక్షులు కొత్తపేట సతీష్, మాజీ ఎంపీపీ తోకల వెంకన్న, అధికార ప్రతినిధి బొడ్డు సతీష్ గౌడ్, కౌన్సిలర్లు తేలుకుంట్ల రాజకుమారి, సామ సుజాత, కొండ్రెడ్డి మధు, మాజీ కౌన్సిలర్ అనపర్తి శేఖర్, ఎండి గౌస్ తదితరులు పాల్గొన్నారు.




