19 August, 2026 | 6:52 PM

బస్వాపూర్ నిర్వాసితులకు రూ.206 కోట్ల నిధులు

19-08-2026 06:12 PM

నిధుల విడుదలపై బి.ఎన్. తిమ్మాపురం గ్రామస్థుల హర్షం

ఆలేరు,(విజయక్రాంతి): బస్వాపూర్ రిజర్వాయర్ ముంపు గ్రామమైన బి.ఎన్. తిమ్మాపురం గ్రామస్థులు ఆర్‌అండ్‌ఆర్, భూసేకరణకు రూ.206 కోట్ల నిధులు విడుదల కావడంపై హర్షం వ్యక్తం చేశారు. సర్పంచ్ ఎడ్ల వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యేతో కలిసి అంబేద్కర్ చౌరస్తాకు చేరుకుని డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

బస్వాపూర్ ప్రాజెక్టు కోసం భూములు కోల్పోయిన రైతులు, నిర్వాసితులకు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తామని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రాజెక్టును పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ తంగళ్లపల్లి శ్రీవాణి-రవికుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేఖా-బాబురావు, ఆత్మ చైర్మన్ కృష్ణారెడ్డి, వైస్ చైర్‌పర్సన్ పోతంశెట్టి మంజుల-వెంకటేశ్వర్లు, PACS చైర్మన్లు సతీష్ పవన్, శ్యామ్ గౌడ్, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.