15 April, 2026 | 4:01 AM

కోనరావుపేట మార్కెట్ యార్డు పరిధిలో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు

06-01-2026 07:38 PM

కోనరావుపేట,(విజయక్రాంతి): కోనరావుపేట మండల మార్కెట్ కమిటీ పరిధిలో కోనరావుపేట మార్కెట్ కమిటీ చైర్మన్ కచ్చకాయల ఎల్లయ్య ప్రతిపాదనలు పంపగా రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కృషితో పలు అభివృద్ధి పనులకు 51 లక్షల 55 వేల రూపాయలు నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

కోనరావుపేట మండల మార్కెట్ కమిటీ పరిధిలో మార్కెట్ యార్డు పరిధిలో ప్రహరీ గోడ,ఆర్చి నిర్మాణానికి, పలు గ్రామాల్లో మార్కెట్ యార్డు పరిధిలో లైట్స్ ఏర్పాటు కోసం నిధులు మంజూరు చేయడం జరిగింది.కాగా నిధులు మంజూరు చేయడం పట్ల రైతులు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు..ఇందుకు కృషి చేసిన రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు ధన్యవాదాలు తెలియజేశారు.