08-01-2026 01:20:35 AM
అలంపూర్, జనవరి 7: గద్వాల జిల్లాలోని అలంపూర్, వడ్డేపల్లి, అయిజ మున్సిపాలిటీల అభివృద్ధి కొరకు ఒక్కొక్క మున్సిపాలిటీకి రూ.15 కోట్లు చొప్పున మూడు మున్సిపాలిటీలకు కలిపి మొత్తం రూ. 45 కోట్ల నిధులను సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్ విడుదల చేసినట్లు ఆ పార్టీ రాష్ట్ర ఎస్సీ కన్వీనర్ వడ్డేపల్లి దేవేంద్ర తెలిపారు.ఈ మేరకు బుధవారం హైదరాబాద్ లోని సంపత్ కుమార్ నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి సన్మానించారు.
అనంతరం మూడు మున్సిపాలిటీల అభివృద్ధి కోసం కృషిచేసిన సంపత్ కుమార్ కు కృతజ్ఞత తెలిపారు.అనంతరం మాట్లాడుతూ ... రేపు జరగబోయే స్థానిక మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో నిలిచిన అభ్యర్థులను అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని తెలిపారు. రాష్ట్ర ప్రజా ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి అండదండలతో మున్సిపాలిటీల అభివృద్ధి కొరకు మరింత నిధులు వచ్చేందుకు కృషి చేస్తానని సంపత్ కుమార్ తెలిపారు. ప్రతి కార్యకర్తకు అన్ని విధాలుగా తోడు ఉంటానని హామీ ఇచ్చారు.