08-01-2026 01:22:05 AM
రాజాపూర్, జనవరి 7: మండల కేంద్రంలోని జాతీయ రహదారి ముఖ్య కూడలిలో ఉన్న ఇండియా వన్ ఏటీఎంలో మంగళవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చోరికి యత్నించినట్లు ఎస్త్స్ర శివానంద్ గౌడ్ తెలిపారు.
రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు, ఇటుక పెల్లలతో ఏటీఎంను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించిన విషయం తెలుసుకొని బుధవారం ఉదయం ఎస్‌ఐ శివానంద్ గౌడ్ ఏటీఎంను పరిశీలించారు. ఏటీఎంలో ఉన్న నగదు అలాగే ఉన్నాయని తెలిపారు. దొంగలను పట్టుకునేందుకు స్థానికంగా ఏర్పాటు చేసిన సిసి టీవీ ఫుటేజ్ లను పరిశీలించి దొంగలను గుర్తించి పట్టుకొని అరెస్ట్ చేస్తామని తెలిపారు.