calender_icon.png 10 January, 2026 | 9:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్క్రాప్ గోదాంలో అగ్నిప్రమాదం

08-01-2026 01:19:53 AM

ముషీరాబాద్, జనవరి 7 (విజయక్రాంతి): భోలక్‌పూర్ డివిజన్ గుల్షన్ నగర్‌లోని అంజుమన్ ఫంక్షన్ హాల్ పక్కన గల మునీర్ స్క్రాప్ గోదాంలో బుధవారం రాత్రి 9:30 గంటలకు ప్రమాదవశత్తు మంటలు అంటుకున్నాయి. దట్టమైన పొగలతో మంటలు ఎగిసిపడడంతో వరుసగా ఉన్న గోదాముల్లో మరో ఆరు స్క్రాప్ గోదాములకు అంటుకున్నాయి. రెండు ఫైరింజన్లు, రెండు హైడ్రా టీమ్‌లు వచ్చి మంటలను అదుపులోకి తీసుకువచ్చాయి. అగ్ని ప్రమాదం వల్ల విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో స్థానికంగా అంధకారం నెలకొంది. ముషీరాబాద్ సిఐ రాంబాబు, డి ఐ నజీమొద్దీన్, ఎస్త్స్రలు పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు.