12 May, 2026 | 6:10 PM

సోనాల మండల కేంద్రంలో సెంట్రల్ లైటింగ్ కోసం 70 లక్షల నిధులు మంజూరు

12-05-2026 05:09 PM

బోథ్,(విజయక్రాంతి): సోనాల మండల కేంద్రంలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు కోసం ప్రభుత్వం 70 లక్షల రూపాయల నిధులను విడుదల చేయడం జరిగిందని మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్ పేర్కొన్నారు. ఇటీవల స్థానిక శాసనసభ్యులు జాదవ్ అనిల్ ఆధ్వర్యంలో తాము హైదరాబాదులోని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసి విన్నవించమన్నారు. సోనాల మీదుగా అంతర్ రాష్ట్ర రహదారి ఉండడంవల్ల ప్రయాణికుల భద్రత కోసం సెంట్రల్ లైటింగ్ ఆవశ్యకతను మంత్రి దృష్టికి తీసుకెళ్లామన్నారు.

దీంతో మంత్రి నిధుల మంజూరీకి ప్రోసిడింగ్ పత్రాలను ఇవ్వడం జరిగిందని తెలిపారు .హైదరాబాదులోని ఈఎంసి మోహన్ నాయక్ నుంచి ప్రెసిడెంట్ కాపీని తీసుకోవడం జరిగిందని పేర్కొన్నారు.నిధుల మంజూరు కి సహకరించిన ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు స్థానిక శాసనసభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు .సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుతో ప్రమాదాల నివారణ అవుతుందన్నారు.