ప్రభుత్వ విప్ సహకారంతో కుల సంఘాల అభివృద్ధి కి ప్రత్యేక కృషి/సర్పంచ్ గండి నారాయణ
రుద్రంగి,(విజయక్రాంతి): ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సహకారంతో కుల సంఘాల అభివృద్ధికి ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తున్నట్టు సర్పంచ్ గండి నారాయణ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని ధర్మపురి లక్ష్మి నరసింహస్వామి ఆలయ ప్రహరీ గోడ నిర్మాణం కోసం 3 లక్షల 50 వేల నిధులు మంజూరు కాగా ప్రొసీడింగ్ కాపీని గంగపుత్ర సంఘం సభ్యులకు అందజేశారు.
అలాగే ముంజ లక్ష్మీ నరసింహ స్వామి ప్రహరీ గోడ నిర్మాణానికి 2లక్షల 50 వేల నిధులు మంజూరు కాగా ప్రొసీడింగ్ కాపీని గంగపుత్ర సంఘం సభ్యులకు అందజేశారు. అలాగే వడ్ల కమ్మరి సంఘం వద్ద 1లక్ష 80 వేల నిధులతో బోర్ మోటార్ మంజూరు కాగా ప్రొసీడింగ్ కాపీని సంఘ సభ్యులకు అందజేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ గండి నారాయణ మాట్లాడుతూ,ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సహకారంతో గ్రామంలోని కుల సంఘాల ఆలయాల అభివృద్ధి పనులకు నిధులు మంజూరు కావడం జరిగిందని అన్నారు.
కుల సంఘాల సభ్యులు అడిగింది తడవుగా నిధులు మంజూరు చేస్తూ అభివృద్ధికి బాటలు వేస్తున్న ఎమ్మెల్యేకు కుల సంఘాల సభ్యులు ఋణపడి ఉండాలని అన్నారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రత్యేక శ్రద్ధతో రుద్రంగి మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. అనంతరం కుల సంఘల సభ్యులు మాట్లాడుతూ... తమ సంఘ భవనాలతో పాటు ఆలయాల అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేసిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు కృతజ్ఞతలు తెలిపారు.






