నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ జిల్లా ఎస్సీ వింగ్ అధ్యక్షులుగా పాల్ కరుణాకర్
05-06-2026 05:37 PM
దళిత క్రైస్తవుల సంక్షేమానికి కృషి చేస్తా: పాల్ కరుణాకర్
ఖానాపూర్(విజయక్రాంతి): నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ నిర్మల్ జిల్లా ఎస్సీ వింగ్ అధ్యక్షులుగా నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గం కడం మండలానికి చెందిన పాల్ కరుణాకర్ నియమితులైనట్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు కడంలో శుక్రవారం స్థానిక అడ్వకేట్ పసువుల రాజలింగం ,బీఎస్పి జిల్లా కార్యదర్శి మల్లేపల్లి గంగయ్య జోసెఫ్, ఏఎస్ఐ మణిరం, కానిస్టేబుల్ నర్సింహులు, డేవిడ్, తదితరులు ఆయనను శాలువా పూలమాలలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన దళిత క్రైస్తవుల సంక్షేమానికి కృషి చేస్తానని అన్నారు.






