30 March, 2026 | 4:42 PM

8 స్టేజ్ నిర్మాణానికి నిధులు వెంటనే కేటాయించాలి

30-03-2026 03:04 PM

సేవ్ వ్యవస్థాపక అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్

కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా

భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో కేటీపీఎస్ 8స్టేజ్ నిర్మాణానికి నిధులు కేటాయించి, వెంటనే నిర్మించాలని డిమాండ్ చేస్తూ సమగ్ర  అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఉద్యోగ, ఉపాధి, పాల్వంచ అభివృద్ధికి కెటిపిఎస్ 8దశ నిర్మాణానికి ఈ బడ్జెట్ సమావేశాలలోనే వెంటనే నిధులు కేటాయించాలన్నారు. అనంతరం ప్రదర్శనగా చాంబర్ వరకు వెళ్లి జిల్లా కలెక్టర్ అంకిత్ గారికి వినతి పత్రం అందజేశారు.

కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఎనిమిదో దశ నిర్మాణం గురించి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానన్నారు. అనంతరం జరిగిన సభలో శ్రీధర్ మాట్లాడుతూ  బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా సెక్రటేరియట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, రెవెన్యూ, వ్యవసాయ శాఖ మంత్రులు శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు, జెన్కో సిఎండీ, స్థానిక శాసనసభ్యులు కూనంనేని సాంబ శివరావు తదితరులకి వినతి పత్రాలు ఇవ్వడం జరిగిందన్నారు. 

ఇప్పటికే పాల్వంచ కెటిపీఎస్ ఓ &యం కూల్చివేత ప్రభావంతో ఉపాది, ఉద్యోగ అవకాశాలు  తగ్గటంతో  పాటు పాల్వంచ అభివృద్ధి కుంటుపడ్డదని, కేటీపీఎస్ 8 వ దశ నిర్మాణాని కిన్నెరసాని, గోదావరి జలాలు,బొగ్గు, భూమి తదితర మౌలిక సదుపాయాలు ఉన్నావని, బడ్జెట్ సమావేశాలలోనే నిధులు కేటాయించి పాల్వంచ,కొత్తగూడెం పరిసర ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పూనుకోవాలని డిమాండ్ చేశారు.