మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
30-03-2026 03:06 PM
కుమ్రంభీం అసిఫాబాద్(విజయక్రాంతి): జిల్లాలో మధ్యాహ్న భోజన కార్మికుల యూనియన్ (AITUC) ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ హరితకు మెమోరాండం సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా AITUC జిల్లా ఉపాధ్యక్షుడు ఆత్మకూరి చిరంజీవి మాట్లాడుతూ వేతనాలు, మెస్ బిల్లులు, కోడి గుడ్ల సరఫరా వంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వంట కార్మికులకు రూ.10 వేల వేతనం ఇస్తామన్న హామీని అమలు చేయాలని, కోడి గుడ్లు మరియు నిత్యావసర వస్తువులను ప్రభుత్వమే సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. అలాగే పెండింగ్ బిల్లులు చెల్లించి, లేబర్ డిపార్ట్‌మెంట్ ద్వారా గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో బుజ్జమ్మ, విజయ, ఆశక్క, అరుణ తదితరులు పాల్గొన్నారు.




