11 July, 2026 | 7:14 PM

Breaking News

సమయంలోపు ఎస్ఐఆర్ ఫాంలను అందించాలి: ఈఆర్ఓ ఎన్. జగదీశ్వర్ రెడ్డి   •   ప్రజాసేవ కార్యక్రమాలు అభినందనీయం   •   జాతీయ స్థాయి ఫోటోగ్రఫీ పోటీల్లో కొప్పుల గోపాలరావుకు గోల్డ్ మెడల్   •   సర్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలి   •   ఆసిఫాబాద్ మున్సిపాలిటీకి పారిశుద్ధ్య వాహనాలు మంజూరు చేయాలి   •   భూ సమస్యలకు శాశ్వత పరిష్కారమే భూ రీ-సర్వే లక్ష్యం   •   ఎస్ఐఆర్ హెల్ప్ డెస్క్ కు భారీ స్పందన   •   మేడారంలో సమ్మక్క సారలమ్మ మొక్కలు తీర్చుకున్న ఎమ్మెల్యే   •   మాజీ జడ్పీటీసీ చొప్పరి సదానందం కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్   •   ప్రమాద బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే రాగమయి దయానంద్   •  

ఎన్ఎఫ్ఐడబ్ల్యూ నూతన కమిటీ ఏర్పాటు

30-03-2026 02:59 PM

కరీంనగర్ క్రేమ్,(విజయక్రాంతి): కరీంనగర్ లోని బద్దం ఎల్లారెడ్డి భవన్ లో జరిగిన భారత జాతీయ మహిళా సమాఖ్య జనరల్ బాడీ సమావేశంలో నూతన కమిటీని ఎన్నుకున్నట్లు ఎన్.ఎఫ్. ఐ. డబ్ల్యూ సీనియర్ నాయకురాలు గూడెం లక్ష్మీ తెలిపారు. జిల్లా అధ్యక్షురాలుగా బీర్ల పద్మ, జిల్లా ఉపాధ్యక్షరాలుగా రాగుల రేణుక, కాట్నపెల్లి అఖిల, జి.వాణి,ప్రధాన కార్యదర్శిగా కొట్టె అంజలి, జిల్లా సహాయ కార్యదర్శులుగా కందుకూరి సావిత్రి, నక్క కేతవ్వ, ఎలిశెట్టి భారతి, కోశాధికారిగా ర్యాకం మల్లికలతో పాటు మరో ఐదుగురిని కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నట్లు గూడెం లక్ష్మీ తెలిపారు.

నూతనంగా ఎన్నికైన అధ్యక్షురాలు బీర్ల పద్మ,ప్రధాన కార్యదర్శి కొట్టె అంజలి మాట్లాడుతూ... మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడుతామని, సంఘటిత, అసంఘటిత రంగాల్లో చాలీ, చాలని వేతనాలతో, అసమానలతో, వివక్షతతో పనిచేస్తున్న మహిళలకు అండగా ఉంటామని, మహిళలకు  సంక్షేమ పథకాలు అమలు చేయాలని పాలక వర్గాలపై పోరాడుతామని, అత్యాచారాలకు, హత్యలకు, వరకట్న వేధింపులకు గురవుతున్న మహిళలకు అండగా ఉంటామని, భారత జాతీయ మహిళా సమాఖ్యను జిల్లా వ్యాప్తంగా బలోపేతం చేయడానికి కృషి చేస్తామని పద్మ,అంజలి తెలిపారు.