14 April, 2026 | 9:05 PM

చర్లపల్లి అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి

17-02-2026 12:37 AM

కుషాయిగూడ, ఫిబ్రవరి 16 (విజయక్రాంతి): మల్కాజిగిరి మునిసిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ) కమిషనర్‌గా నియమితులైన వినయ్ కృష్ణారెడ్డిని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కలిశారు. ఈ సందర్భంగా ఉమ్మడి చర్లపల్లి డివిజన్ పరిధిలో కొనసాగుతున్న,  ప్రతిపాదిత అభివృద్ధి పనులకు అవసరమైన నిధుల కేటాయింపు విషయంపై చర్చించారు.

ముఖ్యంగా రోడ్లు, కాలువలు, తాగునీటి సరఫరా, వీధి దీపాల ఏర్పాటు వంటి ప్రాధాన్య పనులకు తక్షణం ఆర్థిక మంజూరు చేయాలని కోరారు. అభ్యర్థనపై స్పందించిన కమిషనర్, ప్రతిపాదనలు పరిశీలించి అవసరమైన నిధులను దశలవారీగా మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో బీఆర్‌ఎస్ పార్టీ చర్లపల్లి డివిజన్ అధ్యక్షుడు నేమూరీ మహేష్ గౌడ్ పాల్గొన్నారు.