17-02-2026 12:37:38 AM
మెజారిటీ కౌన్సిలర్ లు ఉన్న అందని అధికార పీఠం
విప్ జారిలో ఆలస్యమే కారణమా
జిల్లా అధ్యక్షుని నిర్లక్ష్యం కారణమని ఇంటిపై దాడి చేసిన కార్యకర్తలు
కాంగ్రెస్‌కు ఓటు వేసిన బీజేపీ కాన్సిలర్, ఆమె భర్తను పార్టీ నుండి సస్పెండ్
మెట్ పల్లి, ఫిబ్రవరి 16(విజయక్రాంతి): ఆదినుండి భారతీయ జనత పార్టీ కి అం డగా ఉంటున్న మెట్ పల్లి ఈ మధ్యన జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోను పట్టణ ప్రజలు బీజేపీ కి పట్టం కట్టి ఇరవై ఆరు కౌన్సిలర్ స్థా నాలకు పది మంది బీజేపీ కౌన్సిలర్ లను గెలిపించారు. ఎన్నికల అనంతరం ఇక మెట్ పల్లి మున్సిపల్ ను బీజేపీ స్వాధీనం చేసుకుంటుందని పట్టణ ప్రజలు అనుకున్నారు. కాగా మున్సిపల్ ఎన్నికలో బీజేపీ కౌన్సిలర్ లు పది మంది గెలవగా కాంగ్రెస్ నుండి ఆరుగురు, బిఆరెస్ నుండి ఆరుగురు గెలవగా, స్వతంత్ర అభ్యర్థులు నలుగురు గెలిచారు.
దింతో అత్యధిక స్థానాలు ఉన్న బీజేపీ కి మై నారిటీ కౌన్సిలర్ లు బీజేపీ కి మద్దతు ఇస్తే వారికి వైస్ చైర్మన్ ఇస్తాం ప్రకటించడం జరిగింది. బీజేపీ పార్టీ తమ పార్టీ అధ్యక్షులుగా కౌన్సిలర్ ధర్మపురి స్వరూప ను ప్రకటించగా బిఆరెస్ నుండి పూదరి జ్యోతి, కాంగ్రెస్ నుండి మైలారపు లింబాద్రి ని ప్రతిపాదించ డం జరిగింది.
ఇక బిఆరెస్ ఆరుగురు కౌన్సిలర్ లతో పాటు ఎమ్మెల్యే తమ అభ్యర్థి కి ఓ టు వేయగా. బీజేపీ అభ్యర్థి కి పది మంది లో తొమ్మిది మంది వేయగా 18వ వార్డ్ కౌ న్సిలర్ చెట్లపెల్లి మీనా సుకెందర్ గౌడ్ అనూహ్యంగా కాంగ్రెస్ అభ్యర్థి మైలారపు లింబా ద్రి కి ఓటు వేశారు. దింతో బీజేపీ అధ్యక్ష అ భ్యర్థికి తొమ్మిది ఓట్లు, బిఆరెస్ అభ్యర్థి ఏడు ఓట్లు రాగ కాంగ్రెస్ అభ్యర్థి కి కాంగ్రెస్ ఆరు, స్వతంత్రులు నలుగురు, ఒకరు బీజేపీ ఓటు వేయడం తో మొత్తం పదకొండు ఓట్లు రాగ కాంగ్రెస్ అభ్యర్థి మైలారపు లింబాద్రి చైర్మన్ గా గెలిచినట్లు అధికారులు ప్రకటించారు.
బీజేపీ విప్ జారిలో ఆలస్యమే వారి కొంప ముంచింద
ఈ నెల 16న సోమవారం మున్సిపల్ ఎన్ని క కోసం అధికారులు షెడ్యూల్ ప్రకటించడం. ఎన్నిక సమయం కంటే ఇరవై నాలుగు గంటల ముందు ప్రతి పార్టీ తమ సభ్యులకు విప్ జారీ చేయాల్సి ఉంటుంది. కాని బీజేపీ ఆదివారం ఉదయం విప్ జారికి సంబందించిన పత్రాలు మున్సిపల్ అధికారులకు అందించాల్సి ఉండగా సాయంత్రం పంపించడం జరిగింది. దింతో బీజేపీ విప్ అమలు కాలేదు.ఇదే అధనుగా బీజేపీ 18వార్డ్ కాన్సిలర్ చెట్ల పెల్లి మీనా సుకెందర్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ కి మద్దతూ తెలిపినట్లు తెలిసింది.
మెట్ పల్లి లో బీజేపీ జిల్లా అధ్యక్షుని ని ఇంటిపై దాడి
విప్ జారిలో జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబు నిర్లక్ష్యం కారణని బీజేపీ కా ర్యకర్తలు దాడికి దిగారు.ఇంట్లో ఉన్న ఫర్నిచ ర్ ధ్వంసం చేసి ఇంట్లో ఉన్న వారిని భయబ్రాంతులకు గురి చేశారు. విషయం తెలుసు కున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పలువురు బీజేపీ కార్యకర్తలను అదుపు లోకి తీసుకోని కేసులు నమోద్ చేశారు.
కాంగ్రెస్ కు ఓటు వేసిన కాన్సిలర్, ఆమె భర్త సస్పెండ్
సోమవారం జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కి ఓటు వేసిన 18వ వార్డ్ కాన్సిలర్ చెట్ల పెల్లి మీనా, ఆమె భర్త సుకెందర్ గౌడ్ ను బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణ క మిటీ ఆరు సంవత్సరాలు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది.