11 June, 2026 | 2:27 AM

మీ అభివృద్దే... మా సంకల్పం

11-06-2026 01:27 AM

పంపు సెట్లు అందించిన పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి 

మహమ్మదాబాద్ జూన్ 10 : నిరుపేదలు ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడే మా సంకల్పం నెరవేరుతుందని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు. మండల పరిధిలోని జూలపల్లి గ్రామంలో ఎస్సీ కార్పొరే షన్ పీఎం అజయ్ స్కీం ద్వారా 11 బోర్లు వేయగా 8 మంది లబ్ధిదారులకు 8 పంపు సీట్లు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అందజేశారు.

అందరికీ మేలు చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు అందించడం జరుగుతుందని, పారదర్శకంగా పరిపాలన అందిస్తున్నామని తెలిపారు. ఎవరికి ఎలాంటి సమస్య ఉన్న నేరుగా తమను కలిసి విన్నవించాలని అందరం సమిష్టిగా ఉంటూ ప్రతి సమస్యను పరిష్కరించుకుంటూ అభివృద్ధి వైపు అడుగులు వేద్దామని సూచించారు. 

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు కేఎం నారాయణ. మహమ్మదాబాద్ సర్పంచ్ రామ్లాల్. కొత్త నారాయణ, నిరంజన్ రెడ్డి, పొంచని నర్సింహా, జోగు లింగం,గుండమల నరేష్, పింజరి మైబు, శంకర్ నాయక్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.