నీట్ మళ్లీ నిరహించాలని ధర్నా
09-06-2024 02:01 AM
జగిత్యాల, జూన్ 8 (విజయక్రాంతి): గత నెలలో నిరహించిన నీట్‌ను రద్దు చేసి, తిరిగి నిరహించాలని శనివారం పలువురు విద్యార్థులు ఫ్లకార్డులు చేతబట్టి జిల్లాకేంద్రంలో ధర్నా నిర్వహించారు. నీట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 60 మందికి పైగా ఆల్ ఇండియా స్థాయి మొదటి ర్యాంకు రావడం అనేక అనుమానాలకు తావిస్తున్నదన్నారు. 24 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడే విధంగా అనుమానాలు వ్యక్తమవతుండడంతో కేంద్ర ప్రభుతం విచారణ జరిపించాలన్నారు.






