15 April, 2026 | 9:04 AM

బౌద్ధ సాంప్రదాయాలతో అంత్యక్రియలు

16-12-2025 06:29 PM

అర్మూర్ (విజయక్రాంతి): బహుజన మేధావి మూలనివాసి మాలజీ తల్లీ కూన ముత్తుబాయి(84) ఆదివారం రాత్రి మరణించారు. సోమవారం ఆర్మూర్ జిరాయత్ నగర్ లో ఆమె అంతక్రియలు బౌద్ధ సాంప్రదాయాలతో వినుత్నంగా జరిగింది. దేహంపై నీలి బట్టలు కప్పి, మిత్ర బంధువులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. నిజామాబాద్ నుంచి విచ్చేసిన బంతే బుద్ధఘోష్ మాట చేతుల మీదుగా బౌద్ధ సాంప్రదాయాలతో అంతక్రియలు నెరవేర్చారు. ఆరంభంలో త్రిశరణం పంచశీల్ ఆలపించారు. దానిని ప్రజలు ఉచ్చారించారు.

తదుపరి వైకుంఠదామం వెళ్లే దారి పొడువునా బుద్ధం శరణం దమ్మం శరణం సంఘం శరణం అనే గీతం మైక్ పై మొగుతూ అంతిమస్థానానికి బండి చేరుకుంది. స్మశానంలో శవం కాడు వద్ద బంతే  "శర్ణగాథ" బోధనతో అంతక్రియలు ముగించారు. ఈ యాత్రలో ప్రముఖ అంబేడ్కరిస్టులైన కేశపెల్లి రవి, సుమన్ కుమార్, అంగరి ప్రదీప్, అడ్వకేట్ జీ.జీ రాం, ఆర్గుల సురేష్, అంబుజా, ఇత్వార్పేట్ లింగం, మల్లూరి బాబురావు, సురేష్ షాహు, ఎం.రాజరాం, జాంబవ చమార్, మూగ ప్రభాకర్, బుద్ధిస్ట్ సొసైటీ అఫ్ ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షులు అశోక్ భాగ్యవాన్, కే. కపిల్, రాజరతన్, వికాస్ పవార్, తాళ్ల విద్యసాగర్, తుమ్మల వివేక్, ముతేన్న, అంగుళి మాల, మామిడి రాజు, జి.శంకర్ బంధు మిత్రులు తదితరులు పాల్గొన్నారు.