16-12-2025 06:25:16 PM
కొత్తపల్లి (విజయక్రాంతి): కరీంనగర్ పట్టణం విజయపురి 18వ డివిజన్ లో అస్తపురం కొండగట్టు అనే రైతు యొక్క గేదెల మేతకు కొనుగోలు చేసిన సుమారు ముప్పైవేల రూపాయల గడ్డివాము అకస్మాత్తుగా నిప్పు అంటుకొని కాలిపోయింది. కాలిపోయిన గడ్డివామును బిజెపి పశ్చిమ జోన్ కన్వీనర్ జాడి బాలారెడ్డి సందర్శించి ఏ విధంగా కాలిపోయిందని రైతును అడిగి తెలుసుకున్నారు. జాడి బాల రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నష్టపోయిన రైతును ఆదుకోని నష్టపరిహారం ఇవ్వాలని అన్నారు. సందర్శించిన వారిలో అస్తపురం లింగయ్య, గోదారి నరేష్, విద్యాసాగర్, గొల్ల రాజు ఉన్నారు.