మహాశివరాత్రికి మజాకా
08-02-2025 12:00 AM
సందీప్ కిషన్ 30వ సినిమాగా ‘మజాకా’ రూపొందుతోంది. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్స్‌పై రాజేశ్ దండా నిర్మిస్తున్నారు. లియోన్ జేమ్స్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ మాస్ ఎంటర్‌టైనర్‌లో రీతు వర్మ హీరోయిన్‌గా నటిస్తోంది.
మన్మథుడు ఫేమ్ అన్షు, రావు రమేశ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. శుక్రవారం మేకర్స్ రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. ఈ సినిమా మహా శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 26న విడుదల కానుంది. రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో సందీప్ కిషన్, రీతు వర్మ స్టులిష్ అండ్ కలర్ ఫుల్ డ్యాన్స్ మూమెంట్ అందరినీ ఆకట్టుకుంటోంది.






