20 May, 2026 | 4:46 PM

పుట్టిన రోజున రొమాంటిక్‌గా..

08-02-2025 12:00 AM

సిద్ధు జొన్నలగడ్డ శుక్రవారం పుట్టిన రోజు జరుపు కొన్నారు. ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న చిత్రం ‘తెలుసు కదా’ నుంచి రెండు కొత్త పోస్టర్లు రిలీజ్ చేశారు మేకర్స్. ఈ వేర్వేరు పోస్టర్లలో సిద్ధు, శ్రీనిధిశెట్టి, రాశీఖన్నా  రొమాం టిక్‌గా కనిపించారు.

స్టుటైలిస్ట్ నీరజ కోన డైరెక్టర్‌గా పరిచయమవుతున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతోంది. 

బర్త్ డే స్పెషల్ ట్రీట్.. ‘జాక్’ టీజర్ 

ఫిబ్రవరి 7.. సిద్ధు జొన్నలగడ్డ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ‘జాక్ కొంచెం క్రాక్’ సినిమా టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 10న విడుదల కానుంది. హీరో పాత్రలోని డిఫరెంట్ షేడ్స్ ఈ టీజర్‌లో చూపించారు. సిద్దు స్టులిష్ లుక్స్, యాక్టింగ్‌తో మరోసా రి ఆడియెన్స్‌ను మెస్మరైజ్ చేయనున్నాడని తెలుస్తోంది.

వైష్ణవి చైతన్య, సిద్దు జంట చాలా రిఫ్రెషింగ్‌గా అనిపిస్తోంది. బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నేతృత్వంలోని శ్రీవేంకటేశ్వర సినీ చిత్ర సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది. ప్రకాశ్‌రాజ్, బ్రహ్మాజీ వంటి వారు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి అచ్చు రాజమణి స్వరాలు సమకుర్చారు.