30 March, 2026 | 1:33 PM

Breaking News

మోకిలాలో డ్రగ్ రాకెట్ భగ్నం— నిందితుల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్   •   నటుడు ప్రకాశ్ రాజ్ ఇంట తీవ్ర విషాదం.. ఆయన తల్లి కన్నుమూత   •   శాసనమండలి నుంచి బీఆర్‌ఎస్‌ సభ్యుల సస్పెన్షన్   •   అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం.. సురక్షితంగా బయటపడిన 16 కుటుంబాలు   •   మాజీ ఎమ్మెల్యే మర్రి అభిమానులపై కేసు నమోదు   •   మైనింగ్‌పై దద్దరిల్లిన శాసనసభ బీఆర్‌ఎస్ సభ్యుల సస్పెన్షన్   •   మీ తాతలు దిగొచ్చినా పొంగులేటి రాజీనామా చేయరు   •   కన్నోళ్లకు భరోసా   •   ఆంధ్రోళ్ల చేతికి ఆర్టీసీ!   •   పశ్చిమాసియాలో భూతల యుద్ధం దగ్గరపడింది: అమెరికా 7,000 సైనికులు మోహరింపు, ఇరాన్ 10 లక్షల సైన్యం సిద్ధం   •  

గరీబోళ్ల దైవం కాకా

05-10-2024 12:47 PM

జగిత్యాల, (విజయక్రాంతి): గరీబోళ్లకు గొంతుకై, అన్నార్థులకు ఆపన్నహస్తమై, ఉద్యమకారులకు ఉక్కు పిడికిలై, మేరా సఫర్ జనతా కే సాథ్ అంటూ కడవరకూ తపించి తెలంగాణ కోసమే శ్వాసించిన మహనీయుడు కాకా అని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ అన్నారు. శనివారం జగిత్యాల కలెక్టరేట్ ప్రాంగణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో మాజీ కేంద్రమంత్రి జి. వెంకటస్వామి జయంతి నిర్వహించారు. జిల్లా కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి కాకా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అనేక కార్మిక ఉద్యమాలలో ప్రత్యక్షంగా పోరాటం చేశారని, కార్మికుల పక్షాన అనేక ఉద్యమాలు నిర్వహించి లక్షలాది మంది కార్మికుల జీవితాలకు బాటలు వేశారని తెలిపారు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం నిర్విరామంగా కృషి చేశారని, కాకను స్పూర్తిగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్  పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు పి. రాంబాబు, గౌతమ్ రెడ్డి, కలెక్టరేట్ ఏఓ. హన్మంత రావు, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ది అధికారి సాయిబాబా, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.