1 July, 2026 | 6:59 PM

Breaking News

సీఎం పర్యటన ఏర్పాట్లపై ఎస్పి తనిఖీ   •   అమలు కానీ హామీలతో ప్రజల చెవిలో పూలుపెట్టిన రేవంత్ ప్రభుత్వం   •   ఆర్టీసీ కార్గోను ప్రైవేటు పరం చేస్తే ఉద్యమమే: సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్   •   కృత్రిమ మేధతో కొత్త పుంతలు తొక్కుతున్న వైద్యం   •   విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంది : జిల్లా కలెక్టర్ కె.హరిత   •   ప్రైవేటు పాఠశాలలో పుస్తక దోపిడిని అరికట్టాలి: ఏబీవీపీ   •   బుగ్గపాడు ఫుడ్ పార్క్ భూసేకరణ, నిధుల గోల్‌మాల్‌పై అధికార పార్టీ, టీజీఐఐసీ అధికారులు సిద్ధమా: భాస్కర్ణి వీరంరాజు   •   రైతుల శ్రేయస్సుకు సహకార సంఘాలు కృషి చేయాలి   •   ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా శేషం శ్రీనివాసాచార్యులు   •   ప్రభుత్వ కళాశాలకు కంప్యూటర్ను అందించిన ఎన్నారై భాస్కర్ రెడ్డి   •  

బెల్లంపల్లిలో గడ్డం వెంకటస్వామి జయంతి వేడుకలు

05-10-2024 11:58 AM

బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లిలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ముచ్చర్ల మల్లయ్య, మాజీ మున్సిపల్ అధ్యక్షులు మత్తమారి సూరిబాబుల ఆధ్వర్యంలో శనివారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దివంగత నేత గడ్డం వెంకటస్వామి (కాకా) 95 వ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా జరుపుకున్నారు. ముందుగా కాకా చౌరస్తా లోని కాకా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. కాకా జయంతిని పురస్కరించుకొని నిరుపేదలకు దుప్పట్లను పంపిణీ చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద పేదలకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ తొంగల మల్లేష్, టిపిసిసి ప్రచార కమిటీ కన్వీనర్ నాతరి స్వామి, బండి ప్రభాకర్, మునిమంద రమేష్, చిలుముల శంకర్, గెల్లీ జయరాం యాదవ్ , భూపెల్లి రాజేశ్వర్ , ఎనగందుల వెంకటేష్ , గజ్జల కృష్ణమోహన్ ,ఠాకూర్ కన్య సింగ్ ,పట్టణ మైనార్టీ అధ్యక్షులు ఎండి గౌస్ బాయ్, బండి రాము, ఎండి సల్మాన్, ఎండి ఇమ్రాన్ ,గజ్జల రామ్నాథ్ పాల్గొన్నారు.

కాసిపేట మండలంలో.... బెల్లంపల్లి నియోజకవర్గం కాసిపేట మండలంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రత్నం ప్రదీప్ ఆధ్వర్యంలో శనివారం కాక వెంకటస్వామి 95వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాసిపేట ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కేక్ కట్ చేసి విద్యార్థులకు స్వీట్లు పంచారు. కన్నాల బుగ్గ దేవాలయంలో భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. వేమనపల్లి, తాండూర్, నేన్నల మండలాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు కాకా జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.