గద్దర్ అవార్డుల కమిటీ చైర్మన్ బీ నర్సింగరావు
17 మందితో కమిటీని ఏర్పాటు చేసిన ప్రభుత్వం
హైదరాబాద్, ఆగస్టు 22 (విజయక్రాంతి): తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ప్రతిపాదనలను పరిశీలించిన రాష్ట్రప్రభుత్వం గద్దర్ అవార్డుల విధి విధానాలు, నియమ నిబంధనలు, లోగోను రూపొందించేందుకు సినీ ప్రముఖులతో ఓ కమిటీని నియమించింది. కమిటీ చైర్మన్‌గా ప్రముఖ దర్శకుడు బి.నర్సింగరావు, వైస్ చైర్మన్‌గా దిల్‌రాజు, సలహాదారులుగా దర్శకుడు రాఘవేందర్‌రావు, వాగ్గేయకారుడు అందెశ్రీ, దర్శకుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, గద్దర్ కుమార్తె గుమ్మడి వెన్నెల, నటుడు తనికెళ్ల భరణి, నిర్మాత దగ్గుబాటి సురేష్‌బాబు, గేయ రచయిత చంద్రబోస్, దర్శకుడు, నిర్మాత నారాయణమూర్తి, సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్, దర్శకుడు అల్లాణి శ్రీధర్, నిర్మాత సాన యాదిరెడ్డి, దర్శకులు హరీశ్ శంకర్, బలగం వేణుతో పాటు ఎఫ్‌డీసీ ఎండీని మెంబర్ కన్వీనర్‌గా కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీతో చర్చించిన తర్వాత సర్కార్ కార్యాచరణ మొదలు పెడుతుంది.






