15 March, 2026 | 8:15 PM

Breaking News

విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు   •   కంటి వెలుగులకు… మినీ మొబైల్ హాస్పిటల్ వినియోగం   •   మా గ్రామాలకు నీళ్లు అందించండి   •   అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •   రాష్ట్రంలోనే సుల్తానాబాద్ మున్సిపాలిటీని ఆదర్శంగా నిలుపుతా   •  

రైతు మహాసభను వీడియో కాన్ఫరెన్స్ లో వీక్షించిన గజ్వేల్ రైతులు

30-11-2024 06:17 PM

గజ్వేల్ (విజయక్రాంతి): మహబూబ్ నగర్ జిల్లాలో శనివారం జరిగిన రైతు పండుగ రైతు మహాసభను గజ్వేల్ రైతు వేదికలో మండల రైతులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీక్షించారు. గజ్వేల్ మండలంతో పాటు  వివిధ మండలాల నుండి 500 మంది రైతులు రైతు మహాసభకు తరలి వెళ్లారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతు మహాసభలో సీఎం రేవంత్ రెడ్డి సన్న వడ్లకు రూ.500 బోనస్, రైతు రుణమాఫీ, ఇతర రైతు సంక్షేమ పథకాల గురించి వివరించగా, గజ్వేల్ రైతు వేదికలో రైతులు సంతృప్తి వ్యక్తం చేశారు. గజ్వేల్ లో వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రాధిక, గజ్వేల్ ఏఎంసి వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, డైరెక్టర్లు నర్సింహ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, యాదయ్య, గజ్వేల్ ఎడిఎ బాబు నాయక్, ఎడిఎ దుబ్బాక మల్లయ్య, ఎఓ నాగరాజు, ఎఈఓలు, రైతులు పాల్గొన్నారు.