30-11-2024 06:23:17 PM
నాగర్ కర్నూల్ జిల్లా జడ్జి రాజేష్ బాబు
నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): ఈ ఫైలింగ్ విధానం వల్ల మున్ముందు పేపర్ లెస్ కోర్టులుగా మార్పు చెంది న్యాయవాదులకు, కక్షిదారులకు కేసుల పురోగతి అంశాలను సులభంగా తెలుసుకోవచ్చని నాగర్ కర్నూల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి డి.రాజేష్ బాబు అన్నారు. శనివారం జ్యుడీషియల్ అకాడమీ ఆదేశానుసారం జిల్లా కోర్టులో కోర్టు సిబ్బందికి 57 మందికి ఈ సిటీ 11-2024 సామర్ధ్య పెంపుపై ఈ ఫైలింగ్ శిక్షణ నిర్వహించారు.
ప్రతి ఒక్కరికి ఈ ఫైలింగ్ పట్ల అవగాహన, కమ్యూనికేషన్ స్కిల్స్ ఎంతో ఉపయోగపడతాయని కంప్యూటర్ స్కిల్స్ వల్ల కూడా మనం ఎక్కడ ఉన్నా మొబైల్ ఫోన్ ద్వారా కోర్టులో జరిగే కేసు విచారణ వాయిదాలు కోర్టు ప్రొసీడింగ్స్ అన్ని సులభతరంగా తెలుసుకోవచ్చునన్నారు. న్యాయవాదులు వారి ఆఫీసు నుంచే ఈ ఫైలింగ్ చేసుకొనే సదుపాయం కల్పించబడిందని ఫ్యూచర్లో పేపర్ లెస్ కోర్టుగా మార్చాలని హిస్టారిక్ డే గా గుర్తించబడుతుందన్నారు. జిల్లా పరిధిలోని కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్ నాగర్ కర్నూల్ ప్రాంతాల్లో మీసేవ కేంద్రాలను కోర్టు ప్రాంగణంలోనే ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి జి.సబితా ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ శ్రీమతి మౌనిక న్యాయశాఖ ఉద్యోగులు పత్రిక సోదరులు పాల్గొన్నారు.