గంభీర్ గొప్ప కోచ్ అయ్యే చాన్స్
ముంబై: భారత మాజీ క్రికెటర్ గౌత మ్ గంభీర్ టీమిండియాకు హెడ్ కోచ్‌గా వస్తే గొప్ప శిక్షకుడిగా నిలుస్తాడని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డాడు. ఒకవేళ అతడు కోచ్ పదవికి దరఖాస్తూ చేసుకొని ఉంటే.. బీసీసీఐ అతడిని ఎంపిక చేస్తే తన పాత్రకు పూర్తి న్యాయం చేస్తాడని విశ్వాసం వ్యక్తం చేశాడు. ‘గంభీర్ కోచ్ పదవికి దరఖాస్తూ చేశాడో లేదో తెలియదు.
ఒకవేళ అతడిని ఎంపిక చేస్తే మాత్రం అది మంచి నిర్ణయమే. నిజాయితీ పరుడైన గంభీర్ మంచి నేర్పరి. భారత జట్టు ప్రధాన కోచ్ కావడానికి అన్ని అర్హతలు అతడికి ఉన్నాయి. ఐపీఎల్లో మెంటార్‌గా కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను చాంపియ న్‌గా నిలిపాడు. టీమిండియా లాంటి పెద్ద జట్టుకు కోచ్ పదవి చాలా ఒత్తిడితో కూడుకున్నది. కానీ గంభీర్ మాత్రం దీనికి మినహాయింపు. రోహిత్, కోహ్లీ లాంటి సీనియర్లతో పాటు జూనియర్లను ఎలా డీల్ చేయాలన్నది గంభీర్‌కు వెన్నతో పెట్టిన విద్య’ అని దాదా అన్నాడు.






