1 July, 2026 | 3:13 PM

సబలెంకా అలవోకగా

02-06-2024 12:46 AM

ఫ్రెంచ్ ఓపెన్

ప్రిక్వార్టర్స్‌లో శ్రీరామ్ జోడీ

ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో భారత టెన్నిస్ స్టార్ శ్రీరామ్ బాలాజీ సంచలన ప్రదర్శన కొనసాగుతోంది. మట్టికోటలో అద్వితీయ ఆటతీరు కనబర్చిన బాలాజీ జోడీ కెరీర్‌లో తొలిసారి గ్రాండ్‌స్లామ్ ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టి సత్తా చాటింది. మహిళల సింగిల్స్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్ సబలెంకా అదరగొట్టగా.. రైబాకినా, గ్రచేవాలు కూడా ముందంజ వేశారు. పురుషుల సింగిల్స్‌లో రెండో ర్యాంకర్ కార్లోస్ అల్కారాజ్ అలవోక విజయంతో ప్రిక్వార్టర్స్ చేరుకున్నాడు.

పారిస్: సీజన్ రెండో గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫ్రెంచ్ ఓపెన్‌లో బెలారస్ స్టార్ అరీనా సబలెంకా ప్రిక్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. శనివారం మహిళల సింగిల్స్ మూడో రౌండ్‌లో సబలెంకా 7 6 పాలా బడోసా (స్పెయిన్)పై సునాయాస విజయాన్ని నమోదు చేసుకుంది. గంటా 17 నిమిషాల పాటు సాగిన పోరులో సబెలెంకా ఆద్యంతం ఆధిపత్యం ప్రదర్శించింది. మ్యాచ్‌లో 18 బ్రేక్ పాయింట్లు, 28 విన్నర్లు సంధించింది. మరో పోరులో నాలుగో ర్యాంకర్ ఎలీనా రైబాకినా 6 6 ఎలిస్ మెర్టెన్స్ (బెల్జియం)పై, వర్వారా గ్రచేవా (ఫ్రాన్స్) 7 6 ఇరినా బేగు (రోమెనియా)పై విజయాలు సాధించి నాలుగో రౌండ్‌లో అడుగుపెట్టారు.

శ్రీరామ్ జోరు..

ఫ్రెంచ్ ఓపెన్ డబుల్స్ విభాగంలో భారత స్టార్ శ్రీరామ్ బాలాజీ జోరు ప్రదర్శిస్తున్నాడు. తొలి రౌండ్‌లో విజయం గాలివాటం కాదని నిరూపిస్తూ రెండో రౌండ్‌లో శ్రీరామ్ బాలాజీ వరేలా మార్టినేజ్ (మెక్సికో) జోడీ 6 3 6 ఆడెడ్ ఆరిబేగ్ ద్వయంపై విజయం సాధించి ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. పురుషుల సింగిల్స్‌లో కార్లోస్ అల్కారాజ్ ఆధిపత్యం కొనసాగిస్తూ నాలుగో రౌండ్‌కు చేరాడు. మూడో రౌండ్‌లో ఈ స్పెయిన్ స్టార్ 6 7 (7/5), 6 సెబాస్టియన్ కోర్డా (అమెరికా)పై విజయాన్ని అందుకున్నాడు. 2 గంటల 39 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో అల్కారాజ్ 3 ఏస్‌లు, 12 బ్రేక్ పాయింట్లు, 38 విన్నర్లు సంధించాడు. ఇక కోర్డ్ 40 అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకున్నాడు. మరో మ్యాచ్‌లో ఐదో సీడ్ డానిల్ మెద్వెదెవ్ 7 7 1 6 టోమస్ మెక్‌హక్ (చెక్ రిపబ్లిక్)పై కష్టపడి నెగ్గి ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు.