11 July, 2026 | 9:36 PM

Breaking News

ఆకట్టుకున్న ఐవీవై, సిద్ధార్థ రోబోటిక్స్ ఎక్స్ పో   •   సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాల పేరెంట్స్ కమిటీ అధ్యక్షుని ఎన్నిక   •   సుల్తానాబాద్ శ్రీ శివాలయంకు లలిత అమ్మవారి విగ్రహం అందజేత   •   జిల్లా కమిటీలో ఎన్నికైన పటాన్‌చెరు జర్నలిస్టులకు ఘన సన్మానం   •   ఆవుపై చిరుత దాడి   •   'పేదల కన్నీళ్లు తుడవడమే ప్రభుత్వ లక్ష్యం'   •   కోనరావుపేటలో ఘనంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ జన్మదిన వేడుకలు   •   బేగంపేటలో దొంగల హల్‌చల్.. 20 పంపుసెట్ల విద్యుత్ కేబుళ్ల చోరీ   •   ఉద్యమానికి సిద్ధం.. 17న మందకృష్ణ మాదిగ రాక   •   బాధిత కుటుంబాలను పరామర్శించిన బీఆర్ఎస్ నేత చల్మెడ   •  

క్యాంపస్ షూకేస్ ఆవిష్కరించిన గంభీర్

20-05-2026 12:24 AM

న్యూఢిల్లీ, మే 19: భారత క్రికెటర్లు ఐపీఎల్‌తో బిజీగా ఉండడంతో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తన బ్రాండ్ ప్రమోషన్స్‌లో బిజీగా గడుపుతున్నారు. తాజాగా ప్రముఖ స్పోర్ట్స్ బ్రాండ్ క్యాంపస్‌కు చెందిన షూకేస్ 2026ను గంభీర్ ఆవిష్కరించారు. క్యాంపస్ కొత్త బ్రాం డ్ గుర్తింపును అందరికీ పరిచయం చేశారు.

మూడు రోజుల పాటు జరిగిన క్యాంపస్ షూకే స్ కార్యక్రమంలో గంభీర్ ప్యానెల్ డిస్కషన్స్ లో పాల్గొని తన అభిప్రాయాలు పంచుకున్నారు. ఇప్పుడు ఐపీఎల్‌తో చాలా మంది ఆటగాళ్లకు ఆర్థికపరంగా సపోర్ట్ దొరుకుతోందని, గతంలో మాత్రం స్పాన్సర్ల కోసం ఇబ్బందిపడిన సందర్భాలు చాలా మంది క్రికెటర్లకు ఎదురయ్యాయని గుర్తు చేశారు. ఈ సందర్భంగా యువతకు గంభీర్ కీలక సూచనలు చేశారు.

విజయం అవేది ఒకే మార్గాన్ని అనుసరించడం కాదనీ, లక్ష్యాన్నికి కట్టుబడి ఉండడంతో పాటు ప్రయాణాం ఎలా మారినా ముందుకు సాగాలన్నదే క్రీడల నుంచి నేర్చుకోవాలని సూచించారు. నేటి యువత మనస్తత్వాన్ని ప్రతిబింబించే క్యాంపస్ లాంటి బ్రాండ్ తన లైఫ్‌స్టుల్‌కు దగ్గరగా ఉంటుందన్నారు. రెండు దశాబ్దాలకుపైగా స్వదేశీ బ్రాం డ్ అంచెలంచెలుగా ఎదగడం కంపెనీ సమర్థతకు నిదర్శన మని గంభీర్ కితాబిచ్చారు. తమ ప్రయాణం లో మద్ధతు ఇచ్చిన వారందరికీ క్యాంపస్ సీఈవో నిఖిల్ అగర్వాల్ కృతజ్ఞతలు తెలిపారు.