20 May, 2026 | 3:45 AM

సౌత్ సెంట్రల్ రైల్వే టీమ్ విజయం

20-05-2026 12:26 AM

అక్షత్‌గౌడ్, నిహాల్‌రెడ్డి హాఫ్ సెంచరీలు

హెచ్‌సీఏ ‘ఎ’ డివిజన్ టీ20 లీగ్

సికింద్రాబాద్, మే 19 (విజయక్రాంతి): హెచ్‌సీఏ ‘ఎ’ డివిజన్ టీ20 లీగ్ కమ్ నాకౌట్ టోర్నీ మ్యాచ్‌లు హోరాహోరీగా సాగుతున్నా యి. హైదరాబాద్ నెక్స్‌జెన్ అరెనా వేదికగా జరిగిన మ్యాచ్‌లో సౌత్ సెంట్రల్ రైల్వే జట్టు అదరగొట్టింది. స్టేట్ బ్యాంక్ ఇండియా టీంపై 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఎస్‌బీఐ 10 ఓవర్లలో 3 వికెట్లకు 151 పరుగులు చేసింది. ఓపె నర్ ప్రిన్స్ 48, కెఎస్‌కె చైతన్య 44 పరుగులతో రాణించారు.

సౌత్ సెంట్రల్ రైల్వే బౌలర్లలో సాయి ఆద్రిత్‌రెడ్డి (2/20) ఆకట్టుకున్నాడు. తర్వాత 152 పరుగుల లక్ష్యఛేదనలో సౌత్ సెంట్రల్ రైల్వే ఆరంభంలోనే ఓపెనర్లు షేక్ సమీర్(15), భరద్వాజ్ (1) వికెట్లు కోల్పోయిం ది. తర్వాత సాయి అక్షత్‌గౌడ్, నిహాల్‌రెడ్డి హాఫ్ సెంచరీలతో జట్టును గెలిపించారు. సాయి అక్షత్‌గౌడ్ 52 బంతుల్లోనే 81 (7ఫోర్లు, 5 సిక్సర్లు), నిహాల్ రెడ్డి 32 బంతుల్లో 54 (3 ఫోర్లు, 4 సిక్సర్లు) పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. దీంతో సౌత్ సెంట్రల్ రైల్వే 16.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.